చంద్ర బాబు మాట తీరులో ఎప్పుడు లేనంత ఆగ్రహం కనిపిస్తుంది. అలాగే చిరాకు కనిపిస్తుంది అయితే ఎప్పుడు లేనంతగా ఈ చిరాకు, ఈ ఆగ్రహం ఎందుకంటే 2019 ఎన్నికలంటే భయపడటమే. అయితే చంద్ర బాబు నాయుడు కు మొన్నటి వరకు మిత్రుడిలా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ మీద కూడా చంద్ర బాబు ఆగ్రహంగానే ఉన్నాడు. అయితే  పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహానికి కారణాలు లేకపోలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటికి వచ్చిన తరువాత 2019 లో గలవడం కష్టంగా మారింది టీడీపీ కి.

Image result for pawan kalyan and chandrababu

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ‌టం, టీడీపీ మ‌ళ్లీ ప్రతిప‌క్షానికే ప‌రిమితం కావ‌డం విదిత‌మే. అయితే ప్రజారాజ్యం ఓట్లను చీల్చడం వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి ఇంకా గుర్తే. ఈ ఏడాది మార్చిలో టీడీపీ ప్రభుత్వంపై ప‌వ‌న్ విమ‌ర్శలు గుప్పించారో అప్పటి నుంచి సీన్ రివ‌ర్స్ అయ్యింది. అస‌లు ప‌వ‌న్ కు ఏం తెల్సని ప్రశ్నించ‌డం మొద‌ల పెట్టారు.

Image result for pawan kalyan and chandrababu

ప‌వ‌న్ ట్విట‌ర్‌లో త‌ప్ప ఎక్కడా క‌నిపించ‌డ‌ని, అత‌ని విమ‌ర్శల వెనుక బీజేపీ హ‌స్తం ఉంద‌ని నేరుగా చంద్రబాబే విమ‌ర్శల దాడి చేస్తున్నారు. ఏదైతే 2012లో ఓట్లు చీలి, ప్రతిప‌క్ష వైసీపీ లాభ‌ప‌డుతుంద‌ని చంద్రబాబు భావించి ప‌వ‌న్‌ను వారించారో ఇప్పుడు కూడా అదే ఆందోళ‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. మిత్రప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌పై ప్రద‌ర్శించిన ప్రేమాభిమానాలు కేవ‌లం భ‌యంతోనే అనే విష‌యం ఇప్పుడిప్పుడే అర్థమ‌వుతోంది. గ‌తంలో చిరంజీవి కార‌ణంగా తాను అధికారానికి చేరువ కాలేక‌పోయానో, ఇప్పుడు త‌న‌ అధికార పునాదులు ఎక్కడ క‌దులుతాయోన‌ని చంద్రబాబు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: