పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. తాను చేస్తే నేమో శృంగారం అవతలి వారు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది పవన్ గారి వ్యవహారం . మొన్నటి వరకు 2019 లో తానూ జగన్ కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఒక థియరీ చెప్పాడు అదే జగన్ కు అనుభవం లేదని, అంత వరకు బాగానే ఉంది. మరీ ఇప్పుడేమో అతను నన్ను సీఎం ను చేయండి అంటున్నాడు. మరీ పవన్ గారికి ఉన్న అనుభవం ఏమిటో... !

Image result for pawan kalyan janasena

తనవరకూ వచ్చేసరికి అనుభవం అక్కర్లేదన్నట్టుగా మాట్లాడిన పవన్ కల్యాణ్, ఇప్పుడు మరో విషయాన్ని చెప్పాడు. అదేమిటంటే.. తనను కొంతమంది ‘అనుభవం లేని రాజకీయ నేత’ అని అంటున్నారని పవన్ వాపోయాడు. వారు అలా అనడం తగదని, వారేమైన పుట్టకతోనే అనుభవాన్ని సంపాదించారా? అని లాజికల్ గా ప్రశ్నించాడు జనసేన అధిపతి. విన్నారా.. వేరేవాళ్ల విషయంలో చాలా ఈజీగా రాళ్లు వేసే పవన్ కల్యాణ్, అదే తన విషయంలో మాత్రం ‘అనుభవం’ అనే మాటపై చాలా తత్వాన్నే చెబుతున్నాడు.

Image result for pawan kalyan janasena

వేదాంతాన్ని వివరిస్తున్నాడు. వేరేవాళ్లకు అయితే అనుభవం కావాలి, పవన్ కల్యాణ్‌కు మాత్రం అనుభవం అక్కర్లేదు.. ఎవరైనా పవన్ కు అనుభవం ఉందా? అంటే.. వాళ్లేమైనా పుట్టుకతోనే అనుభవాన్ని సంపాదించుకుని పుట్టారా? అని పవన్ చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు తన అనుభవం గురించి అందరూ ప్రశ్నిస్తుండే సరికి పవన్ కల్యాణ్ కు ఎక్కడలేని లాజిక్కులు గుర్తుకు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: