వాపును చూసి బలం అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏం సాధిస్తుందో తెలియదు కానీ, గత కొన్ని నెలలుగా ఓ రేంజిలో నాయకులు రెచ్చిపోతున్నారు. కర్నాటకలో జూనియర్ పార్టనర్ కి పట్టం కట్టి ఏకంగా దేశంలోనే మోడీని, బీజేపీని నిలువరించేశామని ఖద్దరు పార్టీ నాయకులు కలలు కంటున్నారు. నిన్న కాక మొన్న పార్లమెంట్లో అవిశ్వాసం వేళ ఒక్కటంటే ఒక్క కొత్త పార్టీ మద్దతు కూడగట్టలేకపోయిన ఆ పార్టీ కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వమేనంటూ ఆత్మ వంచన చేసుకుంటోంది.


గెలిపిస్తే అదే చేస్తారట :


ఏపీలో ఉన్న రెండు బలమైన పార్టీలు టీడీపీ, వైసీపీలను వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే ఇంతే సంగతులు  అంటున్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. వారిద్దరూ పాతిక ఎంపీ సీట్లు అడుగుతున్నారు. అలా గంప గుత్తగా ఇచ్చేస్తే మోడీకి  అమ్మేసుకుందామనా అంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ పెద్దాయన. మరి అంత కంటే ఎక్కువగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు సీట్లూ, ఓట్లూ ఇచ్చి గెలిపిస్తే మీరేం చేశారంటున్నారు జనం. ఓ పద్ధతీ పాడూ లేకుండా ఏపీని రెండు ముక్కలు చేసిన నిర్వాకం మీదేగా అంటున్నారు.


గెలిచే సీటు ఒక్కటి వుందా :


అక్కడ రాహుల్ ప్రధాని కావడం తరువాత సంగతి, మరి ఇక్కడ ఏపీలో గెలిచే సీటు ఒక్కటైనా చూపించగలరా అంటే మాత్రం సమాధానం నిల్. ప్రత్యేక హోదా పై వైసీపీ చేస్తున్న బంద్ కి మద్దదు లేదంటున్న రఘువీరా రేపటి రోజున కేంద్రంలో పవర్లోకి వచ్చి హోదా ఇస్తామంటే నమ్మేదెవరన్న ప్రశ్నలూ వస్తున్నాయి. అసలింతకీ మీ టైంలోనే ప్రత్యేక హోదా పై చట్టం ఎందుకు చేయలేకపోయారన్న దానికీ జవాబు లేదు రాదు. ఇతర పార్టీలను విమర్శించడం మానేసి పార్టీ గురించి రఘువీరా ఆలోచిసే బెటర్  అంటూ సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: