ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఈ రోజు ఇచ్చిన బంద్ ను అడ్డుకోవడానికి టీడీపీ సర్కార్ అధికారాన్న్ని ఉపయోగిస్తోంది. . ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా బంద్ ని జరగనీయకుండా ఉక్కు పాదమే మోపుతోంది. నిన్న రాత్రి నుంచే వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన  ప్రభుత్వం ఈ రోజు కూడా అరెస్టుల పర్వాన్ని కొనసాగించింది. హోదాకు మద్దతు అంటూనే అదే అంశంపై  బంద్ చేస్తున్న వైసీపీని టీడీపీ ప్రభుత్వం అడ్డుకోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది.


బాబూ.. నీవు   హోదా వ్యతిరేకివి :


ప్రత్యేక హోదా కు చంద్రబాబు పచ్చి వ్యతిరేకి అంటున్నారు వైసీపీ నాయకులు. విజయవాడలో ఆ పార్టీ నాయకుడు ఎలమంచిని రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ, హోదా కి పచ్చి వ్యతిరేకి బాబు అన్నారు. నిజంగా బాబుకు చిత్త శుద్ధి ఉంటే తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఇలా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా పిలుపుతో ఉత్తరాంధ్ర జిల్లాలలో స్కూళ్ళన్నీ మూత పడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి ఢర్మాన ప్రసాదరావు అర్టీసీ కాంప్లెక్స్ వద్దకు కార్యకర్తలతో చేరుకుని బస్సులు నడవకుండా అడ్డుకున్నారు.


ఇక్కడా అలాగే :


విజయనగరం జిల్లాలోనూ వైసీపీ నాయకులు బస్సులు నడవకుండా రోడ్లపైన బైఠాయించారు. విశాఖలో మద్దిలపలేం జంక్షన్ వద్ద వైసీపీ నాయకులు బంద్ చెపట్టారు. జాతీయ రహదారిపై మానవహారంగా ఏరపడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.  దీంతో వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మొత్తానికి సాఫీగా సాగుతున్న బంద్ ని కావాలనే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: