ప్రత్యేక హోదా కోసం ఈ రోజు వైసీపీ చేపట్టిన బంద్ కు కూడబలుక్కునట్లుగా అన్ని  పార్టీలూ నో సపోర్ట్ అనేశాయి. ఇలా పాలిట్రిక్స్ బాగానే ప్లే చేశాయి. చిత్రమేంటంటే అన్ని పార్టీలూ హోదాకి జై అన్నవే మరి. టీడీపీ అయితే మాకు హోదా ఇవ్వరా అంటూ పెద్ద నోరేసుకుని నిత్యం సొంత పేపర్లో హూంకరిస్తూనే ఉంది. జనసేనాని హోదా కోసం అమరణ దీక్షే చేస్తానంటారు. కామ్రేడ్స్ అయితే మరీనూ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా పోరాడుతామంటాయి.

ఇపుడిపుడే హోదా పుణ్యాన ఊపిరి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సరే సరి. ఇలా అన్ని పార్టీలకు ఏకైక అజెండా కావాల్సిన హోదా పోరు వైసీపీ బంద్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మద్దతు లేదు పొమ్మంటున్నాయి. అసలు హోదా ఉద్యమం ఇలా ఒంటరి ఎందుకైంది..??


పచ్చి అవకాశవాదమే :


హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపు అ పార్టీ నినాదం కాదు. అయిదున్నర కోట్ల నవ్యాంధ్ర ప్రజల గొంతుక. ఈ సంగతి తెలిసి కూడా మద్దతు ఇవ్వకుండా గట్టు మీద కూర్చున్న మిగిలిన రాజకీయ పక్షాలకు ఏమనాలి. ఇది పచ్చి అవకాశవాదమనే చెప్పాలి. వైసీపీ బంద్ సక్సెస్ అయితే జగన్ కి ఎక్కడ పొలిటికల్ మైలేజ్ వస్తుందోనన్న ఆందోళనే ఇందుకు కారణం. ఇలా ఎవరి మటుకు వారు ఆలొచించుకుని బంద్ కి సపొర్ట్ లేదనేశారు.


చెప్పకనే చెప్పాయా :


వైసీపీ బంద్ ద్వారా ఏపీ ప్రజలకు మిగిలిన పార్టీల స్వరూప స్వభావలు తెలిసిపోయాయి. హోదాకు ఎవరు చాంపియన్ అన్నది కూడా వెల్లడైపోయింది. ఆయనొక్కడే హోదా గొంతుక అన్నది కూడా మరో సారి తేటతెల్లమైంది. ఇదే కాదు రేపటి ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం కూడా ఎంచక్కా బయటపడిపోయింది. జగన్ ఒక్కడూ ఒక వైపు, మిగిలిన వాళ్లంతా మరో వైపు అన్నది కూడా బంద్ రాజకీయం చెప్పేసింది. తెర ముందు, తెర వెనక పొత్తుల ఎత్తులను కూడా బయటేసింది. టోటల్ గా వైసీపీ బంద్ పోరు ఆ పార్టీకే కాదు. ఏపీకి మంచే చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: