ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ వద్ద రక రకాల వేషదారణలతో వినూత్న నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. స్వతహాగా సినీ నటుడు అయిన శివప్రసాద్ కొంత కాలంగా రక రకాల వేషాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీని విమర్శిస్తున్నారు.   తాజాగా ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.

'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి వేషధారణలో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపబోమని అన్నారు.  తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ గీతాన్ని ఆలపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రధాని మోదీ ఏమీ చేయకపోయినా... రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: