ఎందుకో కానీ మన చంద్రబాబు కోరి కోరీ అదే మాట అనిపించుకుంటారు. పిలిచి మరీ నిజాలు చెప్పించుకుంటారు. మొన్నటికి మొన్న లోక్ సభలో ప్రధాని మోడీ స్వయంగా బాబు గారి గుట్టు ఇదీ అంటూ బయట పెట్టేసారుగా. ప్రత్యేక ప్యాకేజ్ ఏపీ ముఖ్యమంత్రి కోరితేనే ఇచ్చామంటూ తాపీగా స్టేట్మెంట్ ఇచ్చేశారు కానీ దానికి బాబు గారు పడ్డ బాధ అంతా ఇంతా కాదుగా. అది చాలదన్నట్లుగా ఈసారి రాజ్యసభలో నోటీస్ ఇచ్చి మరీ చర్చ కోరింది టీడీపీ. షరా మామూలుగానే ఇక్కడా బాబు గారి భాగోతం విప్పి మరీ చెప్పేసారు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ జీ.

అంతా బాబు గారి ఆమోదంతోనే :


ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఎంపీలు గట్టిగానే రాజ్యసభలో బీజేపీ సర్కార్ ని నిలదీశారు. దానికి బదులిచ్చిన రాజ్ నాధ్ సింగ్ హోదా బదులుగా ప్యాకేజ్ కి అంధ్ర ముఖ్యమంత్రి ఒప్పుకుంటేనే అంతా చేశామంటూ ఠపీమని అతుక్కుపోయే ఆన్సర్ ఇచ్చేసారు. మరో మంత్రి పీయూష్ గోయల్ అయితే డేట్లతో సహా స్టోరీ అంతా వివరించారు. 2016 అక్టోబర్ 24న ప్యాకేజ్ బాగుందంటూ బాబు కెంద్ర ఆర్హ్దిక మంత్రికి ధన్యవాదాలు చెబుతూ రాసిన లేఖను కూడా బయటపెట్టారు.  పైగా ఏపీకి ఎంతో చేసామని, ఆ సంగతిని నిన్నటి వరకూ తమ మంత్రి వర్గంలో ఉన్న సుజన చౌదరి వంటి వారు కూడా ఇదే సభలో చెప్పారంటూ షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.



 నాలుగేళ్ళుగా మిత్రుడిగా ఉన్న టీడీపీ అపుడు అంతా బగుందని, ఇపుడు బయటకు వెళ్ళి రాజకీయం చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరశింహారావు 'సెటైర్లు వేశారు. బాబుది యూటర్న్ కాదని మల్టీపుల్ టర్న్ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేంద్ర పధకాలను బాబు తనవిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. మొత్తానికి పెద్దల సభలోనూ టీడీపీ ఎంపీలు తలంటించుకున్నారు తప్ప ఏపీకి ఒరిగింది ఏమీ లేదని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: