ప్రస్తుతం దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ రాష్ట్రం. విభజన నేపథ్యంలో అభివృద్ధి జరిగిన ప్రాంతం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందడంతో ఆ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మారింది. పైగా హైదరాబాద్ వంటి నగరం వుండటంతో పరిశ్రమలు పెట్టుబడులు ఇలా అనేక అభివృద్ధి పరిచే అంశాలు చాలానే ఉన్నాయి ఆ రాష్ట్రానికి. అయితే విభజన దెబ్బ విడిపోయిన ఆంధ్రరాష్ట్రానికి చాలా నష్టం చేకూర్చింది.

Image result for harish rao

ఈ క్రమంలో విభజన సమయంలో పార్లమెంటులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన బిల్లులో పేర్కొనడం జరిగింది. అయితే తర్వాత అనేక కారణాలవల్ల ఆంధ్ర రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన ప్రత్యేక హోదా ప్రస్తుతం రాజకీయ అంశంగా మారి ఆంధ్ర రాష్ట్రంలో అనేక వేడిని సృష్టిస్తోంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Related image

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ కి కూడా కచ్చితంగా హోదా ఇచ్చితీరాల్సిందే అని తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసాడు. మేము ఏపీ స్పెషల్ స్టేటస్ కి వ్యతిరేకం కాదు కానీ, వారికీ ఇస్తే మాకు కావాలని అంటున్నాము.ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, పరిశ్రమలన్నీ అక్కడకు తరలిపోతాయని, తెలంగాణ ప్రజలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పారు.

Related image

అలాగే అయన ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టతను ఇవ్వాలని చెప్పారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఏపీకి హోదాకు సంబంధించి తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే, హరీష్ రావు ఈమేరకు డిమాండ్ చేశారు. దీంతో హరీష్ రావు చేసిన ప్రకటనలపై మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: