రాజకీయాలలో ఎవరైనా మనకే కలసి రావాలి. అలా కాని పక్షంలో ఆ చాన్స్ ప్రత్యర్థికి మాత్రం అసలు దక్కకూడదు. ఇదీ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఏపీలో బీజేపీ 2014 ఎన్నికలపుడు  మొదట  వైసీపీ వైపే చూసింది. అతి విశ్వాసంతో ఉన్న జగన్ నో అనేశారు. అప్పటికే కమలనాధులతో చెట్టపట్టాల కోసం ఓ రేంజ్ లో ట్రై చేస్తున్న బాబుకు గొల్డెన్ చాన్స్ దక్కింది. అంతే, హ్యాపీగా మోడీ గాలిని బాగా వాడేసుకుని విడిపోయిన ఏపీకి పదేళ్ళ తరువాత   సీఎం అయిపోయారు. ఇక అప్పట్లోనే పవన్ కళ్యాన్ కొత్త పార్టీ అంటూ రాజకీయ ప్రకటన చేశాడు. ఎలాగోలా ఆయననూ తన బుట్టలో  వేసుకుని ఆ సినీ గ్లామరూ, ఆ వర్గం ఓట్లనూ కూడా లాగేసుకుని లాభపడ్డాడు.


సీన్ కట్ చేస్తే :


నాలుగేళ్ళలో దేశ, రాజకీయ పరిస్థితులు చాలానే  మారాయి. ఓ వైపు మోడీ గ్రాఫ్ బాగా తగ్గింది, ఇంకో వైపు ఏపీలో బాబు గ్లామరూ తగ్గింది. దాంతో వచ్చిన ప్రజా వ్యతిరేకతను కాషాయం పార్టీ ఖాతాలోకి తోసేసి ఆ పార్టీకి బాబు తలాక్ అనేశారు. అయినా ఆ పార్టీ ఎక్కడ వైసీపీతో జట్టు కడుతుందోనన్న భయంతో ఏపీవ్యాప్తంగా బీజేపీని కంపు కొట్టించి తన అనుకూల  మీడియా సాయంతో జనం ముందు దోషిగా  నిలబెట్టేశారు.  ఆ పార్టీతో ఎవరు జట్టు కట్టినా పుట్టగతులు ఉండవన్నతంగా గబ్బు కొట్టించేసారు.



ఇక పవన్ కళ్యాణ్  కూడా టీడీపీకి  గుడ్ బై అనేశారు. ఎక్కడ పవన్ జగన్ కలుస్తారోనని బాబు అండ్ కోలో తెగ కంగారు మొదలైంది.తెర వెనక ఏం జరిగిందో కానీ ఏపీలో జగన్ ని అకారణంగా వ్యతిరేకిస్తున్న కామ్రేడ్స్ తో జనసేన సెట్ అయింది. ఇది బాబు హ్యాపీగా ఫీల్ అయ్యే మరో పరిణామం. దానికి తోడు అన్నట్లు పవన్ ఈ మధ్య మళ్ళీ  వైసీపీ   మీదా బాణాలు   వేయడం ప్రారంభించారు.  దాంతో జగన్ వూరుకుని వూరుకుని ఓ ఘాటైన కామెంట్ చేసి పారేశారు. పవన్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి ఎక్కడ కెలకాలో అక్కడే కెలికారు. 



 ఈ దెబ్బతో జగన్, పవన్ కలవడం ఇక జరగని పని అని తేలిపోయింది. ఇంత కంటే బాబు గారుకి హ్యాపీ మరోకటి ఉంటుందా. అపుడెపుడో ఓ తల పండిన రాజకీయ విశ్లేషకుడు చంద్రబాబు గురించి ఓ మాట చెప్పారు. అందరూ వారి సొంత పార్టీల గురించి మాత్రమే ఆలొచిస్తే బాబు గారు మాత్రం తన పార్టీతో పాటుగా ఇతర పార్టీలలో జరిగే పరిణామాలూ గమనిస్తారట. అంటే దానర్ధం అన్ని రాజకీయాలూ బాబుకు అనుకూలంగా చేసుకోవడం అన్న మాట. ఏపీలో ఇపుడు అదే జరుగుతోందిగా.


మరింత సమాచారం తెలుసుకోండి: