ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు.. బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు ఎదురవుతున్నాయి. ఆయ‌న పార్టీ పెట్టిన నాలుగేళ్ల‌కు కానీ, ప్ర‌జ‌ల్లోకిరాలేదు. అసలు నాలుగేళ్లు పార్టీ ఉందో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, మ‌రో ప‌దిమాసాల్లో ఎన్నిక‌లు ఉన్నాయ‌న‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ఆయ‌న‌కు పార్టీలోనే బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నా యి. ముఖ్యంగా నేత‌ల్లో అసంతృప్తి జ్వాల‌లు పెల్లుబుకుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. మ‌రో కొన్ని నెల‌ల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. వీటిని ప‌వ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వాస్త‌వానికి త‌న‌కు అదికారం ఒద్ద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నికల్లో త‌న‌ను సీఎం నుచేయాల‌ని ప్ర‌జ‌లను కోరుతున్నాడు. దీనివెనుక ఏం జ‌రిగింద‌నేది ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది అధికారం కోసమే కాబ‌ట్టి ప‌వ‌న్ ఆలోచ‌న‌ను త‌ప్పు ప‌ట్ట‌లేం అనేది మేదావుల మాట‌. 

Image result for pawan kalyan

ఇక‌, ఈ క్ర‌మంలోనే పార్టీలోనూ ప‌ద‌వుల పంప‌కంపై ప‌వ‌న్ దృష్టిపెట్టారు. ఇదే ఇప్పుడు జ‌న‌సేన‌లో నేత‌ల మ‌ధ్య అసం తృప్తి జ్వాల‌లు ఎగిసి ప‌డేందుకు కార‌ణ‌మైంది. విష‌యంలోకి వెళ్తే.. పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వివిధ కమిటీలను ప్రకటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్‌ నియమితులయ్యారు. ఇక‌, పార్టీ మీడి యా హెడ్, రాజకీయ వ్యవహారల కార్యదర్శిగా హరిప్రసాద్ ను నియ‌మించారు. .జ‌నసేన లీగల్ సెల్ హెడ్‌గా కె. చిదంబరం ను నియ‌మించారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధిగా  విజయబాబు  ను నియ‌మిస్తూ.. ప‌వ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప‌రిణామాలు ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉండి ప‌వ‌న్కు అన్నివిధాలా సేవ చేసిన వారికి ఇబ్బందిగా మారింది. త‌మ‌కు గుర్తింపు లేకుండా పోయింద‌ని వారు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. 

Related image

పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఆశావహులకు మాత్రం ఇంత వరకూ ఎలాంటి హోదా ఇవ్వకపో వడంపై వారు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. జనసేన తరఫున తన గళం వినిపించే కల్యాణ్ దిలీప్ సుంకర లాంటి వ్యక్తులకు ఒక్కరికి అవకాశం రాకపోవడం గమనార్హం. టీవీ చానెల్స్‌లో డిబెట్స్ మొదలుకుని ఇంటర్వ్యూల్లో జనసేన గళం వినిపించడానికి ఈయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అయితే ఈయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో కాసింత అసంతృప్తికి లోనై ఈ మధ్య ఎక్కడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాల్లేవ్ అని సమాచారం.

అయితే ఇంత వరకూ ఇంకా బూత్ లెవల్ కమిటీలు కూడా పవన్ ప్రకటించలేదు. ఇప్పుడిప్పుడే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో కీల‌క నేత‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. లేనిప‌క్షంలో ప‌వ‌న్‌ను ఈఅసంతృప‌త్ఏ మ‌ట్టి క‌రిపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: