Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 7:22 am IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : హుందాత‌నం కోల్పోయిన రాజ‌కీయం-లోపాలు లేని వాళ్ళెవ్వ‌రు ?

ఎడిటోరియ‌ల్ :  హుందాత‌నం కోల్పోయిన రాజ‌కీయం-లోపాలు లేని వాళ్ళెవ్వ‌రు ?
ఎడిటోరియ‌ల్ : హుందాత‌నం కోల్పోయిన రాజ‌కీయం-లోపాలు లేని వాళ్ళెవ్వ‌రు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాష్ట్ర రాజ‌కీయాలు హుందాత‌నం కోల్పోయింది. సిద్దాంతాలు,  విధానాలు,  ప్ర‌జా స‌మస్య‌ల‌ను గాలికి వ‌దిలేసి కేవ‌లం వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లే ల‌క్ష్యంగా రాజ‌కీయం  సాగుతోంది.  చంద్ర‌బాబునాయుడు, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రూ దీనికి అతీతులు కార‌న్న విష‌యం తేలిపోయింది.  పాద‌యాత్ర‌లో తాజాగా సామ‌ర్ల‌కోట‌లో ప‌వ‌న్ ను ఉద్దేశించి జ‌గన్ చేసిన కామెంట్ల‌యినా, ఈరోజు ఎంఎల్ఏ నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న అయినా అదే కోవ‌లోకి  వ‌స్తుంది. ఇక‌, జ‌గన్ ను ఉద్దేశించి చంద్ర‌బాబునాయుడు అండ్ కో ఎప్ప‌టి నుండో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తూన్న విష‌యం కొత్త‌ది కాదు. 


జ‌నాలే తిర‌స్క‌రిస్తారు 

ysrcp-ys-jagan-janasena-pawan-kalyan-tdp-chandraba

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కార్ల‌ను మార్చినంత ఈజీగా ప‌వ‌న్ పెళ్ళాల‌ను మారుస్తాడు అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పెళ్ళాల‌ను మార్చ‌ట‌మ‌న్న‌ది ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యం. జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా ప‌వ‌న్ పెళ్ళాల‌ను మార్చ‌టం నిజ‌మే. కానీ ఒక‌రికి విడాకులు ఇచ్చిన త‌ర్వాతే మ‌రొక‌రిని వివాహం చేసుకున్న విష‌యం జ‌గ‌న్ మ‌ర‌చిపోయిన‌ట్లున్నారు. వివాహం చేసుకోవ‌టం త‌ర్వాత విడిపోవ‌ట‌మ‌న్న‌ది వారిద్ద‌రికి లేదా కుటుంబాల‌కు మాత్ర‌మే సంబంధించిన వ్య‌వ‌హారం. స‌మాజానికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదే ?  నిజంగా ప‌వ‌న్ చేసిన ప‌ని జ‌నాల‌కు న‌చ్చక‌పోతే జ‌నాలే తిర‌స్క‌రిస్తారు క‌దా ?


ష‌ర్మిల వివాహం  మాటేమిటి ?

ysrcp-ys-jagan-janasena-pawan-kalyan-tdp-chandraba

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కుటుంబం గురించి కూడా అనేక విష‌యాలు ప్ర‌చారంలో ఉన్న‌మాట వాస్త‌వం కాదా ? జ‌గ‌న్ సోద‌రి  ష‌ర్మిలా రెడ్డి వివాహంపై జ‌రుగుతున్న  ప్ర‌చారం మాటేంటి ? ష‌ర్మిల వివాహం గురించి మాట్లాడితే జ‌గ‌న్ కో లేదా ష‌ర్మిల‌కో  ఎలాగుంటుంది ? ఇక‌, జ‌గ‌న్ పై ఉన్న అవినీతి ఆరోప‌ణ‌ల సంగ‌తి కొత్త‌గా చెప్పేదేముంది ? ఎదుటి వాళ్ళను త‌ప్ప‌ప‌ట్టే ముందు మ‌న‌లో ఏ త‌ప్పు లేకుండా చూసుకోవ‌టం  చాలా అవ‌స‌రం. 


జ‌గ‌న్ ల‌క్ష కోట్లు తిన్నారా ?

ysrcp-ys-jagan-janasena-pawan-kalyan-tdp-chandraba

ఇక‌, చంద్ర‌బాబు అండ్ కో గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వైఎస్ మ‌రణించిన త‌ర్వాత త‌లెత్తిన ప‌రిణామాల్లో జ‌గ‌న్ పై అనేక కేసులు న‌మోదై విచార‌ణ జ‌రుగుతోంది. ఇంత వ‌ర‌కూ ఏ ఒక్క కేసులోనూ విచార‌ణ పూర్తి  కాలేదు, శిక్ష ప‌డ‌లేదు. అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని జ‌గ‌న్ పై ఉన్న కేసుల్లో ఏ ఒక్క‌దానిలోనూ ఏ మేర‌కు అవినీతి జ‌రిగింద‌న్న విష‌యం తేల‌లేదు. అయితే, చంద్ర‌బాబు అండ్ కో మాత్రం జ‌గ‌న్ ల‌క్ష కోట్ల రూపాయ‌లు అవినీతి చేశాడంటూ ప‌దేళ్ళుగా ఊద‌ర‌గొడుతూనే ఉన్నారు.  పోయిన ఎన్నిక‌ల్లో అధికారానికి జ‌గ‌న్ ఆమ‌డ‌దూరంలో ఆగిపోయిన కార‌ణాల్లో   అవినీతి కేసులు కూడా ఒక‌టి. ఇక‌, చంద్ర‌బాబు మీదున్న ఆరోప‌ణ‌ల  సంగ‌తేమిటి  ?


బాల‌కృష్ణ‌కు మ‌తిస్ధిమితం లేదా ?

ysrcp-ys-jagan-janasena-pawan-kalyan-tdp-chandraba

ఈరోజు ప‌వ‌న్  మాట్లాడుతూ, అప్పుడెప్పుడో  జ‌రిగిన టిడిపి ఎంఎల్ఏ, చంద్ర‌బాబు బావ‌మ‌ర‌ది నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటిలో జ‌రిగిన కాల్పుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. చాలా కాలం క్రితం త‌న ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్, స‌త్య‌నారాయ‌ణ చౌద‌రిపై బాల‌కృష్ణ కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో వారిద్ద‌రూ తీవ్రంగా గాయ‌ప‌డిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాల్పుల ఘ‌ట‌న అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా ఎంత‌ సంచ‌ల‌నం సృష్టించిందో చెప్ప‌క్క‌ర్లేదు.  త‌న‌కు మ‌తిస్ధిమితం లేద‌ని బాల‌కృష్ణ స‌ర్టిఫికేట్ చూపించి కేసులో నుండి బ‌య‌ట‌ప‌డ్డారనే ప్ర‌చారం అంద‌రికీ తెలిసిందే.  ఏదో స‌ర్టిఫికేట్ చూపించి బాల‌కృష్ణ కేసులో నుండి బ‌య‌ట‌ప‌డ్డారంటే మ‌న వ్య‌వ‌స్ధ అంత బ‌ల‌హీనంగా ఉంద‌ని తేలిపోయింది. సంబంధం లేకుండా ప‌వ‌న్ ఇపుడు బాల‌కృష్ణ కేసును ఇపుడు ప్ర‌స్తావిస్తున్నారు. ఇపుడే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఈ విధంగా ఉంటే రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇంకెంత దుమారం రేపుతాయో చూడాల్సిందే.   


ysrcp-ys-jagan-janasena-pawan-kalyan-tdp-chandraba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : పెరిగిపోతున్న పవన్ సెల్ఫ్ గోల్స్..రివర్సవుతున్న కాపులు
బ్రేకింగ్ న్యూస్ : మాధవ్ నామినేషన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్
షబానా ఎంతపని చేసింది ?... టిడిపికి షాక్
నర్సాపురంలో చంద్రబాబుకు షాక్..వైసిపిలో జోష్
జనసేనకు ఓటేస్తే టిడిపికేసినట్లే..జగన్ బాణం
ఎడిటోరియల్ : చినబాబు ’ఓటుకు నోటు’నే నమ్ముకున్నారా ?
దాడులు నిజమైతే హెరిటేజ్ ను ఎలా విస్తరిస్తున్నారు ?
ఎడిటోరియల్ : తెలంగాణాలో చేతులెత్తేసిన చంద్రబాబు
పోటీనుండి తప్పుకుంటున్నా..రూ 3 కోట్లిచ్చేయండి..టిడిపికి షాక్
ఎడిటోరియల్ : ఆ నియోజకవర్గాలపై టిడిపి ఆశలు వదులుకోవాల్సిందేనా ?
ఎడిటోరియల్ : తిరుపతిలో ముగ్గురికీ మైనస్సులున్నాయి..గెలుపెవరిది ?
ఎడిటోరియల్ : వైసిపి జాబితాతో చంద్రబాబులో టెన్షన్..ఇంకా మార్పులేనా ?
ఈ టిడిపి అభ్యర్ధికి ఎంత కష్టమొచ్చిందో తెలుసా ?
వైఎస్ కుటుంబంలో అరెస్టులు తప్పవా ? పులివెందులకు రాలేకపోవచ్చు
చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు
ఎడిటోరియల్ : దిక్కులేకే మళ్ళీ వైసిపిలోకి వస్తున్నారా ?
ఎడిటోరియల్ :  ఓట్లు చీల్చగలదే కానీ ..సీట్లు గెలవగలదా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు కోపం జగన్ పైనా ? పికె పైనా ? పీక్స్ లో ఫ్రస్ట్రేషన్
ఎడిటోరియల్ : వాళ్ళ ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్...అన్నీ పార్టీల్లో టెన్షన్
లోకేష్ బాబోరూ..మళ్లీ బుక్కయ్యాడు..ఏప్రిల్ 9 పోలింగ్!
ఎడిటోరియల్ : ప్రత్యర్ధులను ఒంటరిగా ఎదుర్కోలేరా ? పవన్ అండ
రంగా చుట్టూ వైసిపి, టిడిపి రాజకీయాలు
లోకేష్ స్ధాయి ఏంటో తెలిసిపోయింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.