విష‌యం ఏదైనా స‌రే వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విరుచుకుప‌డ‌టానికి మంత్రులు, టిడిపి నేత‌లు సిద్ధంగా ఉంటారు. తాజాగా కూడా అదే జ‌రిగింది. ప్ర‌త్యేక‌హోదాకు సంబంధించి   కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రికి నిర‌స‌న‌గా ఏపి బంద్ జ‌రిగింది. వైసిపి ఎంఎల్ఏల‌ను, నేత‌లు, శ్రేణుల‌ను పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. అన్ని వేల‌మందిని అరెస్టులు చేశారంట‌నే బంద్ ఏ స్ధాయిలో జ‌రిగిందో అర్దం చేసుకోవ‌చ్చు. అఫ్ కోర్స్ ప్ర‌జ‌లు కూడా స‌హ‌క‌రించార‌నుకోండి అది వేరే సంగ‌తి. 

బంద్ పై మంత్రుల మండిపాటు

Image result for ministers on ys jagan

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  ఏపిలో బంద్ జ‌ర‌గ‌లేద‌ని మంత్రులు మొద‌లుపెట్టారు. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, గంటా శ్రీ‌నివాస్, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, క‌ళా వెంక‌ట్రావు, ఆదినారాయ‌ణ రెడ్డి త‌దిత‌రులు అస‌లు బంద్ ప్ర‌భావ‌మే లేద‌ని చెప్పారు. య‌న‌మ‌ల‌, గంటా అయితే బంద్ ప్ర‌భావ‌మే లేద‌ని  ఒక‌వైపు చెబుతూనే బంద్ వ‌ల్ల  జిఎస్టీకి కోట్ల రూపాయ‌లు న‌ష్టం జ‌రిగింద‌నిఇంకోవైపు మండిప‌డ్డారు. ఒకే విష‌య‌మై రెండు నాల్క‌ల‌తో మాట్లాడ‌టం టిడిపికే చెల్లింది. 
   
మీడియాకు ఎందుకు నొప్పి ? 


నిజానికి ఏపి బంద్ స‌క్సెస్ అయ్యింద‌నే  చెప్పాలి.  బంద్ స‌క్సెస్ అంటే చంద్ర‌బాబునాయుడు మండిపోతారు. అందుక‌నే టిడిపికి మ‌ద్ద‌తిచ్చే మీడియా ఎక్క‌డా బంద్ అంశాలు చూప‌లేదు. మంగ‌ళ‌వారం సాక్షి టివి ఛాన‌ల్ పూర్తిగా బంద్ వార్త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌టానికే ప‌రిమిత‌మ‌వ్వ‌గా టిడిపి మ‌ద్ద‌తు ఛాన‌ళ్ళు మాత్రం బంద్ వార్త‌ల‌ను దాదాపు క‌వ‌ర్ చేయ‌లేదు.  ఏదో మొక్కుబ‌డిగా స్క్రోలింగ్ రూపంలో మాత్రం చూపాయి. ప్ర‌జా స‌మ‌స్య‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నిర్వ‌హించిన బంద్ ను మీడియా చాలా త‌క్కువ చేసి చూపేందుకు ప్ర‌య‌త్నించింది.  నిజంగా బంద్ గ‌నుక విఫ‌ల‌మ‌య్యుంటే టిడిపి మ‌ద్ద‌తు ఛాన‌ళ్ళు అదే విష‌యాన్ని ప‌దే ప‌దే చూపేవ‌న‌టంలో సందేహమే  లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: