జనసేనాని పవన్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా అన్న ఆలోచనలు రాజకీయ వర్గాలలో కలుగుతున్నాయి. సహజంగా చంద్రబాబుపై తప్ప మరెవరిపైనా అంత తొందరగా నిందారోపణలు, వ్యక్త్రిగత దూషణలూ చేసే  నైజం జగన్ ది కాదంటున్నారు. అటువంటి జగన్ పవన్ పై చేసిన హాట్ కామెంట్స్ వెనుక రాజకీయ వ్యూహమే ఉందంటున్నారు. రెండిందాల ప్రయోజనం పొందేలా జగన్ ఈ కామెంట్స్ చేశారని తెలుస్తోంది.


బీసీల మద్దతు కోసమేనా :


పవన్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాలలో  ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే అక్కడ సామాజిక  వర్గ పరమైన ఈక్వేషన్స్ చూసుకుంటే కాపులకు, బీసీలకు ఎక్కడా పొసగదు. గతంలో ప్రజారాజ్యం టైంలో కూడా అది బయటపడింది. పవన్ ఎంత కాదనుకున్నా ఆయన చుట్టూ ఆ వర్గమే ఉంది. రేపటి ఎన్నికలలో చీలిక వచ్చినా కాపులు ఎక్కువగా పవన్ వెంటే వెళ్తారు. మిగిలిన కాపులతోనే టీడీపీ, వైసీపీ సరిపెట్టుకోవాలి. ఇలా ఆలొచించినపుడు కాపులతో వైరుధ్యం ఉన్న బీసీలను కూడా  ఆకట్టుకుంటే ఆ ఓట్లు దండిగా పొందవచ్చునన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాల పాదయాత్రలో ఆయన బీసీల మంత్రం జపిస్తూ రావడం ఇందుకు ఉదాహరణ. ఏకంగా రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తానని కూడా ప్రకటించారు


అట్నుంచి ఇటు వైపుగా :


ఎంత కాదన్నా బీసీలు టీడీపీతో ఉన్నారు. వారిని ఈ వైపుగా నడిపించేందుకు జగన్ చాలానే శ్రమిస్తున్నారు. ఇపుడు సామజిక వర్గ పరంగా కూడా భరొసా ఇచ్చేలాగానే ఆయన తాజాగా పవన్ పై చేసిన  అటాక్ ఉందని భావించాలి. సరిగా పవన్ సామాజిక వర్గం దండిగా వున్న సామర్లకోట నుంచే జగన్ పవన్ పై డైరెక్ట్ అటాక్ చేయడం ఇందుకేనంటున్నారు. దీనివల్ల వైసీపీతో ఉన్న కాపులు ఎటూ ఉంటారు. అదనంగా బీసీల మద్దతూ పొందవచ్చునన్న ఎత్తుగడ ఉందంటున్నారు.


ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటే :



కేంద్రంలోని బీజేపీ ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ఎలా వాడుకుందో జగన్ సరిగ్గా పవన్ ఎపిసోడ్ తో మహిళల సెంటిమెంట్ కు  గురి పెట్టారని అంటున్నారు. పవన్ మాజీ భార్య రేణూ దేశాయి ఇటీవల కాలంలో పవన్ తో ఎలా విడిపోయారో చెప్పి జనంలో కొన్ని ప్రశ్నలు రేకెత్తించారు. ఆ టైంలో మహిళల నుంచి కూడా ఆమెకు సానుభూతి బాగానే వచ్చింది. పవన్ ఇష్యూలో ఈ కోణం రాజకీయంగా ఇంత వరకూ హైలెట్ కాలేదు సరికదా ఏమంటే ఏం వస్తుందోనని అన్ని పార్టీలూ జంకుతూ వచ్చాయి. జగన్ ఇపుడు
డేరింగ్ గా పవన్ బహు భార్యత్వంపై సెటైర్లు వేయడం ద్వారా  మహిళల వైపు నిలిచారనీ అనుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: