గుజరాత్ లో విద్యా,ఉద్యోగాల్లో పాటిదార్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఉద్యమం చేసిన హార్థిక్ పటేల్ ఆ మద్య గుజరాత్ ఎన్నికల్లో కీలక భూకి పోషించారు.  కాంగ్రెస్ తో జతకట్టిన హార్థిక్ పటేల్ బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారైయ్యారు.   అయితే హార్థిక్ పటేల్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి..కానీ వాటన్నింటిని ఆయన ఖండించారు.  పటేల్‌(పాటిదార్) రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్దిక్‌ పటేల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2015లో పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసులో హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు 50వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది.   
Image result for హార్థిక్ పటేల్ శిక్ష
పాటీదార్ ఉద్యమ నేతగా హార్థిక్ పటేల్ గుజరాత్ లో అనేక ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో జరిగిన దాడుల్లో హార్థిక్ పటేల్ తో పాటు మరో ఇద్దరిని బాధ్యులుగా కోర్టు నిర్ధారించింది. మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో హార్దిక్ పటేల్ తోపాటు ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్‌ పటేల్‌ వర్గం నేత లాల్జీ పటేల్‌, ఏకే పటేల్‌ను కూడా దోషులుగా నిర్దారించింది.   
Hardik Patel, 2 others get two-year jail term in Visnagar rioting case
మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  2015 లో జరిగిన అల్లర్ల లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో హార్దిక్‌ పటేల్‌.. హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు నేడు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: