పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. పార్లమెంట్ తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటుకు 3వేల 675మంది, శాసనసభకు 8వేల 895 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరారు. నేషనల్ అసెంబ్లీలోని 272 స్థానాల కోసం పాకిస్థాన్ వ్యాప్తంగా ఉదయం 8 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు 85 వేల పోలింగ్ బూత్‌లలో 10 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

pakistan-general-elactions

4 లక్షల మంది పోలీసులు, 371,388 సైనికులు పోలింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు. గురువారమే ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.  పంజాబ్ లో ముఖ్యంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎల్‌ఎం-ఎన్, ఇమ్రాఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది. మొత్తం 272 జాతీయ అసెంబ్లీ సీట్లలో పంజాబ్‌లోనే 141 ఉన్నా యి. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి పౌర, సైనిక పాలనల మధ్య ఊగిసలాడుతున్న పాకిస్థాన్‌ లో ఒక పౌర ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగి మరొక పౌర ప్రభుత్వానికి అధికారం అప్పగించనుంది. 

pakistan votes in tight race between imran khan, ex pm nawaz sharifs party

పాక్‌ చరిత్రలో ఇంతకుముందు ఇలా ఒక్కసారే జరిగింది.  ఈ ఎన్నికలకు ముందు అధికార పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి, సైన్యానికి మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించారు. గతంలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాని ఆ పార్టీకి ప్రస్తుతం 32 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే సైన్యం, పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో పాటు ఇస్లామిక్‌ ఛాందస వాదులు ఇమ్రాన్‌ విజయానికి సహకరిస్తున్నందున ఆయన గెలుపు తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


 ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో  పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.  దేశవ్యాప్తంగా బలగాల మోహరింపు పూర్తయ్యిందని, స్థానిక పోలీసులతో కలిసి సురక్షితంగా ఎన్నికలను నిర్వహిస్తామని సైన్యం పేర్కొంది. కాగా ఈ ఎన్నికల్లో పంజాబ్ ప్రావిన్స్ సానుకూలత ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: