ఈ రోజు ఉదయం దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఎన్నికల పోలింగ్ మొదలైంది.  మధ్యాహ్నం వరకు అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు తప్ప ఎన్నికలు సరళి మాములుగానే సాగింది.  ఓవైపు సార్వత్రిక ఎన్నికలుకోసం ప్రజలు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరుతున్న సమయంలో..క్వెట్టా నగరంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 30 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు పోలీసులు.
Image result for పాకిస్థాన్ బాంబు
గాయపడినవారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.  ఈ ఎన్నికలు ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి, నవాజ్ షరీఫ్ పార్టీకి మధ్య పోటీగా మారాయి. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడేందుకు బహిరంగంగానే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, ఎన్నికల బ్యాలెట్ల భద్రత కోసం 3,70,000 మంది భద్రత సిబ్బందిని రంగంలోకి దించారు. 

సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా.. బూత్ బయట ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌ లో సమీపంలో పేలని గ్రనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ బూత్‌ ను పేల్చేందుకు వెళ్లిన సూసైడ్ బాంబర్‌ ను పోలీసులు అడ్డుకున్నారు.
Image result for పాకిస్థాన్ బాంబు
పరిస్థితిని అదుపుచేసే పనిలో ఉన్నారు పోలీసులు.  పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభాలు సర్వసాధారణం. గత కొన్ని నెలలుగా జరుగుతోంది కూడా అదే. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు జైలులో ఉన్నారు. ఒక అవినీతి కుంభకోణం నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Image result for పాకిస్థాన్ బాంబు


మరింత సమాచారం తెలుసుకోండి: