జగన్ విషయం లో పవన్ ఎందుకు అలా..!

పవన్ కళ్యాణ్ మీద జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసినారు. అయితే అవన్నీ నిజం అనుకోండి కానీ ఆలా మాట్లాడటం రాజకీయాల్లో దూకుడు తనానికి నిదర్శనమని తెలుస్తుంది. అయితే పవన్ మీద చేసిన ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ నుంచి గట్టి కౌంటర్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఎందుకో కానీ జనసేన టీం తరుపున జగన్ వ్యాఖ్యలను ఖండించారు.
అయితే ఈ ప్రెస్ మీట్ కి ముందు జనసేనలో చాలా తర్జనభర్జనలు జరిగాయి. జగన్ వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో పవన్ వ్యక్తిగతంగానే స్పందిస్తే బాగుంటుందని ఆయనకు పార్టీ నేతలు, సన్నిహితులు సూచించారట. ఈరోజు జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మీడియా, జగన్ వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించినా కూడా పవన్ తర్వాత మాట్లాడతానని చెప్పి ఆ అంశాన్ని దాటవేశారు.
సాయంత్రం పవన్ ప్రెస్ మీట్ ఉంటుందని, జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశముందని, తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు ఆయన నేరుగా బదులు చెబుతారని మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే పవన్ కల్యాణ్ ఎందుకో వెనక్కితగ్గారు. తన టీమ్ తో ప్రెస్ మీట్ పెట్టించి సరిపెట్టారు. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు పవన్ నేరుగానే స్పందించారు. వ్యక్తిగత విషయాల జోలికొస్తే.. తాను కూడా చాలానే మాట్లాడతానని ధీటుగా బదులిచ్చారు. అయితే ఈసారి ఎందుకో జగన్ విషయంలో మాత్రం ఆయన వెనక్కితగ్గారు.