నిన్న బుధవారం తృణ మూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు లోక్‌ సభలో బాహా బాహీకి సిద్ధమయ్యారు. తృణ మూల్ కాంగ్రెస్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ మొదలైన వారు కోపోద్రిక్తులై అధికార పక్షం బాజపా సభ్యుల వైపు దూసుకు వచ్చి కిరీట్ సోమయ్యపై దాడికి సిద్ధమయ్యారు. బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ మరి కొందరు అడ్డుపడి తృణ మూల్ సభ్యులను శాంతపరిచి వారి సీట్లలోకి పంపించి వేశారు. 
bjp mp kirit somaiya కోసం చిత్ర ఫలితం
తృణ మూల్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వాదించుకుంటూ కొట్లాటకు దిగటంతో సభాపతి సుమిత్రా మహాజన్ సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేయవలసి వచ్చింది. లోక్‌సభ స్పీకర్ బాహాబాహీకి దిగిన టీఎంసీ, బీజేపీ సభ్యులకు చివాట్లు పెట్టారు. అధికార, ప్రతిపక్షం సభ్యులు ఇలా కొట్టుకునేందుకు సిద్ధం కావటం సిగ్గు చేటని, ఇక మీదట ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 
lok sabha yesterday కోసం చిత్ర ఫలితం
మొదట కిరీట్ సోమయ్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ లో నలుగురు మహిళలను ఇద్దరు వ్యక్తులు వివస్త్రలను ధారుణంగా మానభంగం చేశారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందుకు మీరు అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ సిగ్గు పడాలంటూ, టీఎంసీ సభ్యులపై విమర్శల దాడి చేశారు.  దేశం లోని ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సామూహిక లైంగిక,అత్యాచార  దాడులను ఖండించే మీరు మీ స్వంత రాష్ట్రంలో  జరిగిన జరుగుతున్న సంఘటనలను పట్టించుకోరా? అని కిరీట్ సోమయ్య నిలదీశారు.
సంబంధిత చిత్రం
దీనికి టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ స్పందిస్తూ, తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ దశలో కిరిట్ సోమయ్య ఆవేశంతో ముందుకువచ్చారు. ఇది చూసిన కళ్యాణ్ బెనర్జీ మరికొందరు టీఎంసీ సభ్యులు ఆవేశంతో అధికార పక్షంవైపు దూసుకు వచ్చి కిరిట్ సోమయ్యతో బాహాబాహీ కి దిగారు.
అయితే బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ మరి కొందరు ఇతర పార్టీల సభ్యులు జోక్యం చేసుకుని ఇరుపక్షాలను శాంతింపజేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తరువాత కూడా టీఎంసీ, బీజేపీ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: