చంద్ర‌బాబునాయుడు...40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.  అయితే మాత్రం ఏం లాభం. భ‌విష్య‌త్తును స‌రిగా ఊహించ‌లేకపోయారు. త‌న అనుభ‌వాన్ని ఏపి అభివృద్ధికి ఉప‌యోగించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కాపీ కొట్టాల్సిన పరిస్ధితిలో ప‌డ్డారు. ఇదంతా  ఎందుకంటే,  తాజాగా చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక‌హోదాపై ఉన్న‌తాధికారులతో   స‌మావేశం జ‌రిగింది.  ఆ స‌మావేశంలో గ‌డ‌చిన నాలుగేళ్ళుగా జ‌గన్ ఏదైతే చెబుతున్నారో ఇపుడు  చంద్ర‌బాబు అవే విష‌యాల‌ను చెప్పారు. దాంతో 40 ఏళ్ళ  అనుభ‌వ‌మున్న  చంద్ర‌బాబు కూడా  40 ఏళ్ళ వ‌య‌స్సున్న జ‌గ‌న్ ను కాపీ కొడుతున్నార‌న్న విష‌యం అర్ధ‌మైపోయింది. 


హోదాకు చంద్ర‌బాబే బ్రాండ్ అంబాసిడ‌రా ?

Image result for chandrababu official review meeting

ఉన్న‌తాధికారుల‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ, ప్ర‌త్యేక‌హోదా వ‌చ్చి ఉంటే ఏపికి ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చి ఉండేవ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు వివిధ రాయితీలు, ప‌న్నుల్లో మిన‌హాయింపు త‌దిత‌ర ప్రోత్సాహ‌కాలు  ఇవ్వ‌టం వ‌ల్లే పారిశ్రామికవేత్త‌లు ఉత్సాహం చూపుతార‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు వ‌ల్లే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని కూడా సిఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యాల‌న్నింటినీ గ‌డ‌చిన నాలుగేళ్ళుగా జ‌గ‌న్ చెబుతున్న‌వే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.


గ‌తంలో జ‌గ‌న్ పై మండిప‌డిన సిఎం

Image result for chandrababu lashes on jagan

హోదా వ‌ల్ల ఉప‌యోగాల‌ని ఒక‌వైపు జ‌గ‌న్ చెబుతుంటే ఇంకోవైపు హోదా వ‌ల్లే అన్నీ వ‌చ్చేయ‌వ‌ని, ప్ర‌తిప‌క్ష నేత ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు చంద్ర‌బాబు ఎన్నోసార్లు జ‌గ‌న్ పై మండిప‌డిన ఘ‌ట‌న‌లున్నాయి. తాను వ్య‌తిరేకించ‌ట‌మే కాకుండా మంత్రులు, నేత‌ల‌తో కూడా హోదాను తీవ్రంగా వ్య‌తిరేకించేట్లు చేశారు చంద్ర‌బాబు. దాని ఫ‌లితంగానే చంద్ర‌బాబు కేంద్ర‌ప్ర‌భుత్వం ముందు చాలా ప‌లుచ‌నైపోయారు. జ‌గ‌న్ మీద కోపంతోనే కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజి భేషంటూ ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. అంతేకాకుండా కేంద్ర ఆర్దిక‌శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అభినంద‌న తీర్మానం కూడా చేశారు. 


ఇంత దారుణంగా కాపీనా ?


 అన్నీ చేసిన త‌ర్వాత స‌రిగ్గా  ఎన్నిక‌ల ముందు బిజెపితో క‌టీఫ్ చెప్పేశారు. జ‌నాల మూడ్ గ‌మ‌నించిన చంద్ర‌బాబు కొత్త‌గా ప్ర‌త్యేక‌హోదా వ‌ల్లే ఏపి అభివృద్ధి చెందుతుంద‌ని  కొత్త పాట మొద‌లుపెట్టారు. నాలుగేళ్ళుగా కేంద్రం ఏపిని మోసం చేస్తూనే ఉందంటూ ధ్వ‌జ‌మెత్తారు.  హోదా వ‌ల్ల ఏపికి వ‌చ్చే ఉప‌యోగాలేంట‌నే విష‌యంలో ఇపుడు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇవ్వ‌టం మొద‌లుపెట్టారు.  ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఒక విష‌యం మ‌ర‌చిపోయారు. అదేమిటంటే, నాలుగేళ్ళుగా హోదాకు సంబంధించి జ‌గ‌న్ చెబుతున్న విష‌యాల‌నే తాను కాపీ కొడుతున్నాన‌ని.  పైగా  


మరింత సమాచారం తెలుసుకోండి: