Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 6:31 pm IST

Menu &Sections

Search

జాతి సంపద మొత్తం ప్రజా ప్రతినిధుల మాటున దాగిన దోపిడి దొంగలపాలు? ఏపి హైకోర్ట్

జాతి సంపద మొత్తం ప్రజా ప్రతినిధుల మాటున దాగిన దోపిడి దొంగలపాలు? ఏపి హైకోర్ట్
జాతి సంపద మొత్తం ప్రజా ప్రతినిధుల మాటున దాగిన దోపిడి దొంగలపాలు? ఏపి హైకోర్ట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దోపిడి చేసేవాళ్ళు అధినాయకత్వం అనుంగు సహచరులైతే జాతి భూగర్భ సంపద మొత్తం దోచబడుతున్నా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ సంస్థ నిద్ర నటిస్తుందా? దిన దినం నీతులుచెప్పే నిప్పు తనను తానే నివురుతో కప్పెట్టుకొంటుందా? కుల బందు జనులు, బలగం నేరగాళ్ళైతే చూసీ చూడనట్లు ఊర్కుంటుందా? ఇంత సంపద ధారుణంగా దోచబడుతున్నా ప్రత్యేక హోదా వదిలేసి ప్రత్యేకపాకేజీలు అంటూ ప్రభుత్వమే వీధిపోరాటాలకు దిగితే పాలనకొనసాగేదెలా? ప్రకృతి ప్రసాధించిన జాతి భూగర్భ సంపద మొత్తం  తరలివెళ్ళినా, నావాళ్ళు దోచేస్తే, నాకేం పర్వాలెదన్న తనకై తాను నిపురంగు పులుముకున్న నీతిమంతుని ప్రభుత్వ ధోరణి జాతికి ఎప్పుడూ ప్రమాదకరమే.  
ap-news-apmdc-tdp-mla-yarapatineni-srinivasarao-ca
"వెనక నుండి ఏనుగులు పోయినా ఫర్వాలేదు, ముందు నుండి ఒక్క దోమ పోయినా చూస్తూ క్షమించనన్న ధోరణితో కబుర్లు చెప్పే చండశాసన ముఖ్యమంత్రి నాయకత్వం లోని ప్రభుత్వం దాని మంత్రి మండలి  మందీ మార్బలం"  ప్రజా ప్రయోజనాల పర్వంలో స్వ ప్రయోజనాల కోసం తార్చేసినదెంత?"  
ap-news-apmdc-tdp-mla-yarapatineni-srinivasarao-ca
విభజన ఫలంగా చటం ప్రసాదించిన పది పదేళ్ళ ఉభయ రాష్ట్రాల రాజధానిని వదిలేసి , ఒక ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ప్రతిష్ఠ, టిటిడిలో వెలుగు చూస్తున్న నిర్వాకాల తో  భారత హిందూ జాతి ఉనికి ప్రశార్ధకమయ్యే సందర్బాలను ఇలాంటి నేరాలతో విరాజిల్లే పరిస్థితులను చూసీ చూడనట్లు ఒక విధంగా ప్రోత్సహించే ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమా? చివరకు ప్రభుత్వాన్ని భరించే జాతీ ఒక జాతేనా? అనే అనుమానాలు రాకమానవు. 


ఏపి హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ పై కురిపించిన ప్రశ్నా పరంపరే పై వాటన్నికి పెద్ద ఉదాహరణ.
 
ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపి హైకోర్టు మండిపడింది. అత్యంత ధారుణంగా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ చేస్తూ విలువైన ఖనిజసంపదను తరలించుకుని పోతుంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. సాధాతణ కూలీలపై కేసులు పెట్టి అసలు నేరస్తులను అందలమెక్కిస్తారా? అలాంటి వ్యక్తులను వదిలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్‌ శాఖ అధికారుల విచారణ తీరు ను కూడా తీవ్రంగా ఆక్షేపిస్తూ, "లేని నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతికినట్లు" ఉందంటూ మండిపడింది. 


ఈ పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లా కోనంకి, నడికుడి, కేశానుపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో తదుపరి ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలంటూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), కేంద్ర గనుల శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా వారిని ఈ కేసులో సుమోటోగా (తనంతట తాను) ప్రతివాదులుగా చేర్చింది. 
ap-news-apmdc-tdp-mla-yarapatineni-srinivasarao-ca
బాబు, లోకేష్ భుజం తట్టారు 


అంతేకాక అక్రమ మైనింగ్‌ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది. ఆయన వాదనలను వినదలిచామని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలు ఏమైనా తీసుకుని ఉంటే, ఆ వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.  
 

ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశనుపల్లి, దాచేపల్లి, కొండమోడు మరికొన్ని గ్రామా ల్లో యథేచ్ఛగా లైమ్‌-స్టోన్‌ తవ్వకాలు జరుపుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పిడుగురాళ్లకు చెందిన కె.గురవాచారి 2015లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీని పై విచారణ జరిపిన అప్పటి ధర్మాసనం అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయించడంతో పాటు బాధ్యులను గుర్తించి వారి నుంచి అక్రమ మైనింగ్‌ వల్ల కలిగిన నష్టాన్ని వసూలు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు లైమ్‌-స్టోన్‌ తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారని, రూ.31 కోట్ల మేరకు ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు బుధవారం దానిని మరోసారి విచారించింది.  
 

పిటిషనర్‌ తరుఫు న్యాయవాది ఎన్‌వీ సుమంత్‌ వాదనలు వినిపిస్తూ, కోనంకి, నడికుడి, కేశనుపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్టు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారుల గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులను చేస్తూ కొందరు స్థానికులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అక్రమ మైనింగ్‌ పై దర్యాప్తు చేసిన లోకాయుక్త అధికారులు తమ నివేదికలో, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరును ప్రస్తావించినా, మైనింగ్‌ అధికారులు మాత్రం పెద్దల జోలికి వెళ్ల కుండా స్థానికంగా పనిచేసే నలుగురు కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారని వివరించారు. కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం, బాధ్యుల నుంచి దోచుకున్న సొమ్మును వసూలు చేసే విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తర్వాత ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ, అక్రమ మైనింగ్‌ చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, రెండు ట్రాక్టర్లను జప్తు చేసినట్లు వివరించారు.  
 ap-news-apmdc-tdp-mla-yarapatineni-srinivasarao-ca
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఎంత మందిపై కేసు నమోదు చేశారు? ఎంత మందిపై విచారణ ప్రారంభించారు? ఎన్ని టన్నుల ఖనిజం అక్రమంగా తరలిపోయింది? ఈ వివరాల సంగతేంటని ప్రశ్నించింది. నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశనుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో ముగ్గురు, నలుగురు కూలీలపై కేసులు పెట్టినట్లున్నారు. ముగ్గురు నలుగురికి ఇంత పెద్ద స్థాయిలో రాత్రికి రాత్రే ఖనిజం తరలించడం సాధ్యమయ్యే పనేనా? అవినీతికి ఇది పరాకాష్ట. 


జాతి సంపదను దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అక్రమ మైనింగ్‌ చేసినట్లు గుర్తించినవారికి ఎటువంటి డిమాండ్‌ నోటీసులూ ఇవ్వలేదు. జరిగిన నష్టాన్ని రాబట్టేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే, అధికారులు కచ్చితంగా అవినీతికి పాల్పడినట్టే. అటువంటి అవినీతిపరులపై అవి నీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. బతుకు దెరువు కోసం కూలి పనులు చేసు కుంటున్న వాళ్లపై కేసులు పెట్టిన అధికారులు, ఖనిజ సంపద దోచుకున్న వారిపై పెట్టరా? అసలైన వ్యక్తులను వదిలేసి, అనామకులపై ఎఫ్‌ఐఆర్‌ లు నమోదుచేసి విచారణ చేస్తారా? ఇటువంటి చర్యలను మేం ఎంత మాత్రం ఆమోదించబోం. ఈ కేసులోని వివరాల ను పరిశీలిస్తే, లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. దీనిపై కాగ్‌ చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, గనుల శాఖ అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ap-news-apmdc-tdp-mla-yarapatineni-srinivasarao-caఈ హైకోర్ట్ వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రజలకొచ్చే అనుమానమేమంటే కొందరు నేరగాళ్లు చేయలేని ఈ పని జరిగిపోతోందంటే దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత అక్రమ సామ్రాజ్యం ఉందా? అలాగైతే ప్రభుత్వం ఎందుకు మిన్నకుంది? లేకపోతే అధినాయకత్వ గణాలకు ఈ వ్యవస్థీకృత నేరాల్లో బాగస్వామ్యముందా? అనేది ప్రజలనుండి వెల్లువెత్తుతున్న అనుమానాల వరద. ఆ వెల్లువ చెలియలి కట్త దాటక ముందే నియంత్రించకపోతే జాతికి ప్రకృతి ప్రసాధించిన సంపద కోల్పోయి నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పటికే ఆ పరిస్థితులు దాపురించాయి. ఇసుక కుంభకోణంలో అనేక మంత్రి తెలుగుదేశం మంత్రులు, ఎమెల్యెల పాత్ర ఉందని అప్పు డప్పుడు బయటపడే సందర్భాలు చూస్తూనే ఉన్నాం.  

ap-news-apmdc-tdp-mla-yarapatineni-srinivasarao-ca
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకుల్..ప్రీత్..సింగ్  అవకాశాలు అందిపుచ్చు కుంటూ ఆల్-వుడ్స్ లో దూసుకెళ్తూ.....
ప్రధాని మోడీపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్-ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
"తూ నీ బతుకు చెడ"  కెసిఆర్ పంచ్  కొంప ముంచేలా ఉందే? : ఈసీ కొరడా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
స్త్రీల అండర్-వేర్ ఇలాగే ఉంటుంది! పార్ల‌మెంట్‌లో ఎంపీ
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
తెలంగాణాలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కు మరణమృదంగమే
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం మరో సినిమాటిక్ కుట్ర "ఆపరేషన్ - బి": తమ్మారెడ్డి భరద్వాజ  ఉవాచ!
పారడైజ్‌ అగ్నికి ఆహుతి
"ఏబిపి-సి ఓటర్" సర్వే ప్రకారం తెలంగణాలో మహాకూటమి ప్రభుత్వం - టిఆర్ఎస్ ఫినిష్
క్రేజీ హీరోతో త్వరలో జత కట్టనున్న స్వీటీ అనుష్క
అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!
About the author