1.నాకు 10 మంది MLA లు ఉంటె జగన్ లాగా పిరికివాడు లాగా అసెంబ్లీ వదిలి పారిపోయేవాడిని కాను , నేను సీఎం అయితేనే సమస్యలు తీరుస్తా అని జగన్ అనడం తప్పు -పవన్

మీ దేవుడు అన్న చిరంజీవి 18 MLA లు ఉండి కూడా పోరాడలేక కాంగ్రెస్ లో కలిపేసాడు కదా?

ఇక పొతే 22 మంది YCP MLA లను కొని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇస్తే కూడా బాబును పల్లెత్తు మాట అనలేదు పవన్ ..

స్వయంగా కోడుమూరు MLA మని గాంధీ నను బాబు కొన్నాడు , నేనే కాదు వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన వాళ్లంతా అమ్ముడుపోయిన సరుకే అని చెప్పాడు కదా
మరి నీకు కనపడలేదా?

అసెంబ్లీ లో జగన్ కు మైక్ ఇచ్చి వెంటనే కట్ చేసి జగన్ ను బాండ బూతులు తిట్టిస్తుంటే జగన్ ఏమి చేయాలి?

పోనీ 3 .5 సం అసెంబ్లీ కి వెళ్లారు కదా మరి జగన్ లేవనెత్తిన ఏ సమస్య బాబు పరిష్కరించాడు?అసెంబ్లీ కి వెళితే మైక్ ఇచ్చేదెవరు, మాట్లాడనిచ్చేదెవరు ?

మరి ఇప్పుడు పోయిన కూడా జగన్ ను  తిట్టడమే కానీ ఏమి జరుగుతుంది అసెంబ్లీ లో?

మీ అన్న చిరంజీవి ఎన్ని సార్లు రాజ్యసభ చర్చల్లో పాల్గొని ప్రజల సమస్యలు తీర్చాడు ?

4 సం లు బాబు చేసిన అవినీతి ని చూసీ చూడనట్టు ఉండి ఇపుడు కూడా జగన్ మీద రాళ్ళూ వేస్తుంటే ఎంత కాలం అని భరిస్తారు?

నిన్ను జగన్ ఎప్పుడూ ఏమీ అనలేదు కానీ నీవే జగన్ ను చాలాసార్లు అన్నావు చిరంజీవి అంటే అభిమానం ఉన్నప్పటికీ తప్పడం లేదు , ఆలా చేస్తుంది నీవే పవన్

2. జగన్ దోచుకున్నాడు


జగన్ మీద ఉన్నకేసుల మొత్తం విలువ 1300 కోట్లు (లక్ష కోట్లు కాదు) , కోర్ట్ లో ఉన్నప్పుడు కోర్ట్ తీర్పు ఇచ్చేవరకు వేచి ఉండాలి, అంతే కానీ ఆరోపణలు చేస్తే ఎలా?

నాకు జగన్ కేసుల గురించి తెలిఅయిదు, సుజనా చౌదరి ఏవో కాగితాలు చేతిలో పెడితే మాట్లాడాను అని గతం లో ఒక సారి అన్నావు పవన్, మరి ఇది కరెక్టేనా?

3.జగన్ కు అనుభవం లేదు అందుకే బాబుకు మద్దతిచ్చాను

Image result for jagan and babu

2014 కి 5 సం MP గ ఉన్నాడు జగన్, పైగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు మరి జగన్ కె అనుభవం సరిపోదు అనుకొంటే మీ అన్న చిరంజీవికి 2009 లో ఏమి అనుభవం వుంది అని అంత పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి సీఎం ని చేయమని ప్రచారం చేసావు ?

మరల ఇప్పుడు నీకు ఏమి అనుభవం వుంది అని నన్ను సీఎం ను చేయండి అను అంటున్నావు?

అంతే రూల్స్ మీకు వర్తించవా, ఎదుటివానికేనా నీతులు?

4 .జగన్ సీఎం అయి ఉంటె నన్ను ఏమి చేసేవాడో?
Image result for చిరంజీవి ప్రజారాజ్యం
2009 లో మీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాడు కదా ఆయననుఆ ఏమీ చేయలేదు కదా YS మరియు జగన్ లు నీవు కాంగ్రెస్ వాళ్ళ పంచెలూడతేసి కొట్టమని అన్నా కూడా నిన్ను ఏమీ చేయలేదు కదా !!!

ఇక పొతే YS తండ్రి రాజారెడ్డి ని May 23,1998 న బాబు CM గా ఉన్నప్పుడు అయన ప్రత్యర్ధులు చంపారు , 2004 లో సీఎం అయినాడు YS అయినా వారిని చాంపలేదు , అందరూ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కదా !!!

మరి రాజారెడ్డి ని చంపినా హంతకులను చట్టానికి వదిలేసి న YS కుటుంబం ఎవరిని మాత్రం ఎందుకు చంపుతుంది?

మరి వంగవీటి రంగాను బాబే చంపించాడు అని కాపు నాయకులే చెప్పారు కదా మరి అలాంటివాడికి నీవు మద్దతు ఎలా ఇచ్చావు?

ఇక పొతే 2013 -14 మధ్య చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లను GVK మాల్ దగ్గర చిరంజీవి సెక్యూరిటీ చేత చితకకొట్టించాడు రామ చరణ్ , వీడియో లు కూడా ఉన్నాయి అయినా మనం శుద్దపూసలం..

5. 2009 లో ప్రజారాజ్యం యువనేతగా ఉన్న నీవు 9 సం ఆవినీతి చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు అని అన్నావు , నన్ను పరిటాల రవి గుండు కొట్టించాడు అనే ప్రచారం టీడీపీ ఆఫీస్ నుంచే జరిగింది అని నాకు తెలుసు అని నీవే అన్నావు మరి ఎందుకు 2014 లో మద్దతిచ్చావు?

6. 2014 ఎన్నికల్లో గెలిచాక రాజ్యసభ సీటు ఇస్తాను అని ఇంకా ఏవేవో చెప్పాడు బాబు, మోసం చేసాడు అని చెప్పావు

మరి మొన్న టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీ లుగా CM రమేష్, మరియు లాయరు కనకమేడల రవీంద్ర బాబు కు ఇచ్చాక ఇక నాకు రాజ్య సభ సీటు ఇవ్వడం లేదు అని ఎదురు తిరిగినట్టున్నావు అని అనిపిస్తుంది కదా ?

7. జగన్ ది వారసత్వం-పవన్ 

Image result for jagan & pawan

మరి చిరంజీవి పేరు చెప్పుకొని నీతో పాటు ఒక అరడజను మంది హీరోలు ఎలా వచ్చారు సినీ పరిశ్రమలోకి?

ఇప్పడు రాజకీయాల్లోకి వచ్చాక నేను కానిస్టేబుల్ కొడుకుని అని కన్వీనియంట్ గా చెప్పుకుంటావా?

8. రాజకీయాల్లో ఆ రెండు కులాలేనా? పవన్
నిజమే రెడ్లు కమ్మోల్లేనా అని నీవు అనడం లో న్యాయం వుంది , రేపు ప్రజలు ఓట్లు వేస్తె నీవే మొదటి కాపు సీఎం కావచ్చు, మొన్న అన్న చిరంజీవి ట్రై చేసాడు ప్రజలు తిరస్కరించారు కదా !!! 

రాజ్యం వీర భోజ్యం , ప్రయత్నించి చూడు తప్పులేదు జగన్ ఎండనక వాననకా గత 8 సం లుగా రోడ్డు మీద ఉంటున్నాడు ఎక్కువగా , నీవూ కష్టపడు , ప్రజలు ఆశీర్వదిస్తే నీవు కూడా కావచ్చు..

మరి సినీ పరిశ్రమ లో మాత్రం ఎక్కువగా కమ్మ కాపు హీరోలేనా? మిగతా వారు పనికి రారా? ఇక్కడ ఈ రెండు కులాల పెత్తనమేమిటి అని అనవేమి?

రేపు మీ జనసేన లో చేరేవాళ్ళు అంతా నిప్పులే ఉంటారా అది కూడా చూద్దాము !!!

నీవు ఏతా వాతా చెప్పేదేమిటంటే మనం ఎదుటివానికి నీతులు చెబుతాము కానీ పాటించము అంటావు..

మనం ఎదుటివారిని వేలెత్తి చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు మనల్ని ఎత్తి చూపిస్తాయి అని మరవద్దు పవన్ !!!

మీ అన్న చిరంజీవి కానీ నీవు కానీ పార్టీ నడిపి ఉంటె తెలుస్తాయి సాధకబాధలు !!!

వ్యక్తిగతంగా సినిమాల పరంగా నేను మెగా అభిమానిని కానీ తప్పడం లేదు ఇది ఎవరి మనసులను నొప్పించాలని మాత్రం రాయలేదు

Note: బహుశా గత 5 సం లుగా పవన్ చేస్తున్న దాడిని భరించి భరించి తట్టుకోలేక నిన్న జగన్ ఓపెన్ అయినాడు అని నేను అనుకొంటున్నాను..

మరింత సమాచారం తెలుసుకోండి: