గుంటూరు జిల్లాలో తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస్ అక్ర‌మ  మైనింగ్ పై  హై కోర్టు చేసిన తాజా వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపుతోంది.  నాలుగేళ్ళుగా  ఎంఎల్ఏ అక్ర‌మ మైనింగ్ చేస్తుంటే అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తోందంటూ నిల‌దీయం ఇపుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  జిల్లా అధికారులు, ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ఎంఎల్ఏ అడుగుల‌కు మ‌డుగులు వేస్తోందా అన్న‌ట్లుగా హై కోర్టు మండిప‌డుతోంది.  ఎంఎల్ఏ అక్ర‌మ మైనింగ్ పై కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) చేత ఆడిట్ చేయించాల‌ని చేసిన వ్యాఖ్య‌లే కోర్టు సీరియ‌స్ గా ఉండో చెబుతోంది.


అక్ర‌మంలో  ఎంతమంది భాగ‌స్ధులో ?


ఎంఎల్ఏ అక్ర‌మ మైనింగ్ ఈ నాటిది కాదు.  ఎంఎల్ఏకి మ‌ద్ద‌తుగా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు అండ‌దండ‌లు అందించ‌టం వ‌ల్లే ఈ స్ధాయిలో అక్ర‌మ వ్యాపారం చేసుకున్నార‌న్న‌ది వాస్త‌వం. ఎంఎల్ఏ అక్ర‌మ మైనింగ్ కు ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు అండ‌దండ‌లే అందించారో లేక‌పోతే భాగ‌స్ధులో తేలాలంటే క‌చ్చితంగా పూర్తిస్ధాయి విచార‌ణ జ‌రిపితేన సాధ్య‌మ‌వుతుంది. జ‌ర‌గాల్సిన విచార‌ణ మ‌ళ్ళీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రిగితే ఉప‌యోగం ఉండ‌దు. కోర్టు ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన‌పుడే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. 


రూ. 270 కోట్లు దోచుకున్నారా ?


ఇంత‌కాలం ఎక్క‌డో క‌ర్నాట‌క‌లో గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి  అక్రమ మైనింగ్  చేస్తున్నారంటూ చంద్ర‌బాబు త‌దిత‌రులు ఆరోప‌ణ‌లు చేసేవారు. మ‌రి, త‌మ పాల‌న‌లోనే రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరులోనే  య‌ర‌ప‌తినేని చేస్తున్న అక్ర‌మ మైనింగ్ గురించి ఏమి స‌మాధానం చెబుతారు ?  వైసిపి నేత‌లు ఆరోప‌ణ‌లు ప్ర‌కారం నాలుగేళ్ళ‌ల్లో య‌ర‌ప‌తినేని 43 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అక్ర‌మ మైనింగ్ చేశార‌ట‌. సుమారు రూ. 270 కోట్ల విలువైన అక్ర‌మ మైనింగ్ చేసినందుకు ఎంఎల్ఏపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసిపి నేత కాసు మ‌హేశ్ రెడ్డి డిమాండ్ కు చంద్ర‌బాబు కానీ మంత్రులు కానీ స‌మాధానం చెబుతారా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: