గోదావరి జిల్లాలతో తనకు ఎంతో అనుబంధం ఉందంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ రోజు భీమవరంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన ఈ జిల్లాలతో తనది ప్రత్యేకమైన బంధమని చెప్పుకున్నారు. తానంటే ఇక్కడ ప్రజలకు అభిమానమని కూడా ఆయన అన్నారు. పైగా రాజకీయాలను మలుపు తిప్పే చైతన్యం ఈ జిల్లాలదేనంటూ తెగ పొగిడేశారు. ఇలా నా దారి గోదారేనని చెప్పకనే చెప్పేశారు.


నా వల్లే అదంతా :


గోదావరి జిల్లాల ప్రజలకు పోయిన ఎన్నికలలో తాను తెలుగుదేశాన్ని గెలిపించమని పిలుపు ఇచ్చానని, దానికి తగినట్లే వారు స్పందించి గెలిపించారని పవన్ చెప్పుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్లకు పదెహేనూ టీడీపీకి వచ్చాయంటే అది తన క్రెడిట్ అన్నారు పవన్. ఇన్ని సేట్లు కట్టబెట్టిన జిల్లాను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ విమర్శించారు. అధికారాన్ని మాత్రం పంచుకుని హ్యాపీగా ఎంజోయ్ చేస్తున్నారని సెటైర్లు విసిరారు. 


లోకెశ్ పై పంచ్ లు :


తాను నారా లోకేశ్ లా కంఫర్ట్ జోన్ లో ఉంటూ రాజకీయాలు చేయడంలేదంటూ పవన్ పంచ్ డైలాగులు పేల్చారు. . తనది సామాన్య కుటుంబమని, ఎంతో కష్టంతో రాజకీయాలలో కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. ఓపిక, కష్టపడే మనస్తత్వం ఉండే వాళ్ళే రాజకీయాలలో రాణిస్తారని ఆయన అన్నారు. మొత్తానికి తన మాటలతో ఉత్తరాంధ్రని ఉబ్బేసిన పవన్ ఇపుడు గోదారి పాట అందుకున్నారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: