జగన్ తన మీద చేసిన వ్యాఖ్యలకు పవన్ మరోసారి ఆసక్తి కరమైన కామెంట్స్ చేసినాడు. తన పెళ్లిళ్లు గురించి జగన్ విమర్శలు చేసిన నేపధ్యం లో నాకేమి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి అన్ని పెళ్ళిళ్ళు చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. దాని వెనుక ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. రేణు దేశాయ్ చెప్పినట్లు విడాకులు ఇవ్వకుండానే వేరే అమ్మాయితో  సహజీవనం చేసి బిడ్డను కనడం తప్పు కాదా.. నీకు ఎన్ని సమస్యలు ఉన్న దానిని తప్పే అంటారు..!

Image result for jagan and pavan

జగన్ వ్యా‍ఖ్యలు తన అభిమానులను, జనసైనికులను బాధించాయన్న పవన్‌ ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని కోరారు. ఈ వివాదంలోకి జగన్‌ కుటుంబసభ్యులను కానీ, ఆ ఇంటి ఆడపడుచులను కానీ వివాదంలోకి లాగొద్దని జనసేన నేతలకు, కార్యకర్తలకు సూచించారు.  తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాల్లేవన్న జనసేనాని రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లబోనన్నారు. కేవలం విధివిధానాలపైనే పార్టీలతో విభేదిస్తానన్నారు. అంతకుముందు తనపై జగన్ చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు.

Image result for jagan and pavan

ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేరన్నారు. రాజకీయాలు చేసేందుకు వేల కోట్లు అవసరం లేదని, గూండాలు అక్కర్లేదని విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరు. పారిపోతారు. అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావని పవన్ చెప్పారు. ఇసుక మాఫియా, దోపిడీలు చేసే నాయకులకే ఇంత ధైర్యం ఉంటే ప్రజాసంక్షేమం కోసం నిలబడే నాకెంత తెగింపు ఉండాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మెతక అనుకునేరు.. తాటతీస్తానంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: