Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 4:35 pm IST

Menu &Sections

Search

నేడు గురుపౌర్ణమి..భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు!

నేడు గురుపౌర్ణమి..భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు!
నేడు గురుపౌర్ణమి..భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ  అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు.
guru-purnima-temples-sai-baba-temple-red-moon-spec
ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. చంద్రగ్రహణం రోజే గురుపౌర్ణమి వస్తుంది. దీంతో ఆ రోజు ఎంతో విశిష్టమైనది అంటున్నారు కొంత మంది పండితులు. ఆ రోజు ఏపని తలపెట్టినా విజయవంతం అవుతుంది అంటున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యాన్ని నమ్మే వారు.. కుజదోషం ఉన్న వారు 27వ తేదీన ఏ పని చేపట్టినా తిరుగులేని విజయం సాధిస్తారంట. ఏలిననాటి శని నడుస్తున్న వారికి ఈ చంద్రగ్రహణం సందర్భంగా.. శని బలహీనపడి మంచి జరుగుతుందంట. కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.
guru-purnima-temples-sai-baba-temple-red-moon-spec
వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు.

guru-purnima-temples-sai-baba-temple-red-moon-spec

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు  :

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు సాయి ఆలయాలకు చేరుకుని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పంజగుట్టలోని సాయి దేవాలయంలో ఉదయం నుంచే భక్తులు బాబాను దర్శించుకుంటున్నారు. మహర్షి శ్రీ వేదవ్యాసుడు జన్మించిన రోజును మనం గురుపూర్ణిమగా జరుపుకుంటాం.  మహారాష్ట్రలోని షిర్డీలో ఆలయాన్ని గురుపూర్ణిమ పర్వదినం సందర్భంగా సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు భజనలు, పూజలతో సాయి ఆరాధనలో మునిగి తేలుతున్నారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత :

నేడు (జూలై 27)  అర్థరాత్రి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గంటా 45 నిమిషాలు సుదీర్ఘంగా ఉంటుంది. అదే రోజు గురుపౌర్ణమి. సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఇదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలు గ్రహణంకి మూసివేస్తున్నారు. బ్లడ్ మూన్ గా చంద్రుడు అలరించనున్నాడని సైంటిస్టులు అంటుంటే.. అరిష్టమని జాగ్రత్తలు పాటించాలని పండితులు అంటున్నారు. దీనికితోడు 15 ఏళ్ల తర్వాత అంగారకుడు భూమికి మరింత దగ్గరగా రాబోతున్నాడు. పెద్దగా కనిపిస్తున్నాడు. అదే రోజు భూమి అంతం అవుతుంది అంటూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పుకార్లు పుట్టాయి.


వందేళ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం :

ఈ శతాబ్దంలోనే అరుదైన అద్భుతం. అర్ధరాత్రి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇది అద్భుతమైన అవకాశమని… ప్రతి ఒక్కరు తప్పక చూడాలని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ  తెలిపింది. నేటి రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని తెలిపింది.
ఈ శతాబ్దంలోనే వచ్చే అద్భుతమైన ఖగోళ వింతను చూసి ఆనందించాలని కోరుతున్నారు. ఇళ్లల్లో కూర్చుని మిస్ కావద్దని కోరుతున్నారు. అనవసరంగా పూజలు, పునస్కారాలు, భయాలు వదిలేసి.. ఎంజాయ్ చేయమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.


guru-purnima-temples-sai-baba-temple-red-moon-spec
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.