భారతీయ రైల్వేలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయన్న విషయానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండబోదేమో. 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యం చేరుకోవడానికి మూడున్నరేళ్ల సమయం పట్టిందంటే నమ్మగలరా? కలలోనైనా నమ్మలేనంత నిర్లక్ష్యమిది.  2014లో బుక్ చేసిన ఈ వేగన్ తీరా ఇప్పుడు రావడం చూసి రైల్వే అధికారులు షాక్ కు గురవగా, ఇది విన్న జనాలకి మైండ్ బ్లాంక్ అయింది. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ వేగన్ ‌(107462)లో ఎరువులను పార్సిల్ చేసి… విశాఖపట్నం పోర్టు నుంచి ఓ షాపు యజమాని రామచంద్ర గుప్తాకు పంపించింది.

ఆ రైలు బోగీ ఎక్కడుందో అధికారులు గుర్తించలేకపోవడంతో, ఈ మూడున్నర సంవత్సరాల పాటు ఆ బోగీ దేశమంతా తిరుగుతూనే ఉంది. రైల్వే స్టేషన్లను దాటుతున్నా, పక్క బోగీల్లో లోడింగ్, అన్ లోడింగ్ జరుగుతున్నా, ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ఎన్ని నెలలు గడిచినా ఎరువుల పార్సిల్ రాకపోవడంతో సదరు యజమాని రైల్వే శాఖకు ఎన్నోసార్లు లేఖరాసినా జవాబిచ్చే దిక్కేలేకుండా పోయింది. రూ.10 లక్షల విలువైన ఎరువులను నింపిన ఈ వ్యాగన్ 3.5 ఏళ్లుగా దేశం మొత్తం తిరుగుతూ తిరుగుతూ గమ్యం చేరింది.
Image result for india railway
ఎన్ని రైల్వే స్టేషన్లను దాటుకుని వెళ్తున్నా అధికారులు దీన్ని పట్టుకోలేకపోయారు.  చివరకు ఇటీవల దీన్ని గుర్తించి, చేరాల్సిన ప్రాంతానికి చేర్చగా, అప్పటికే దానిలోని ఎరువులన్నీ పాడైపోయాయి. దాన్ని తీసుకునేందుకు యజమాని నిరాకరించడంతో పట్టాలపైనే ఓ పక్కన ఉంచారు. ఇప్పుడు తనకు జరిగిన నష్టాన్ని రైల్వే శాఖే చెల్లించాలని రామచంద్ర గుప్తా డిమాండ్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: