ఏపీ రాజకీయ చదరంగంలో ఒక్కో అడుగు ముందుకేస్తూ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు జనసేనాని. నాలుగు నెలల క్రితం వరకూ ప్రశ్నించే పార్టీ అంటూ చెప్పిన పవన్ ఈ రోజు భీమవరం సభలో పాలించే పార్టీ కూడా మాదే అంటూ అసలు విషయం చెప్పేశారు. ఏపీ రాజకీయాలలో రెండు పార్టీల వ్యవస్థ ఇప్పటివరకూ ఉంది. దానికి మెల్లగా కదుపుతూ కుదుపుతూ  తన పార్టీకీ స్పేస్ ఉండేలా ఎత్తుగడలు వేస్తున్నారు పవన్.


ఆ ఇద్దరినీ ఒకే గాటకు :


ఏపీలో అధికార విపక్షాలైన టీడీపీ, వైసీపీల మధ్య భీకరమైన పోరు సాగుతోంది. మధ్యలో పవన్ పాత్ర ఏముంటుందని అనుకున్న వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా పవన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీ ఓటర్ మదిలో ఇంతవరకూ  ఉన్న చంద్రబాబు,  జగన్లను ఒకే వైపునకు నెట్టేసి రెండవ వైపు తానే అంతా నిలబడాలని పవన్ బాగానే  ప్లాన్ చేశారు. అందులో భాగమే ఆయన  చంద్రబాబు, జగన్ ను కలిపి కట్టేసి  చేస్తున్న సవాళ్ళు.


ముఖాముఖీకి సవాల్ :


ఉత్తరాంధ్ర టూర్లో ఏంచేశారో సరిగ్గా భీమవరం సభలోనూ అదే చెప్పారు పవన్. చంద్రబాబు, జగన్ ప్రజా సమస్యలపై చర్చించేందుకు తనతో ఒకే వేదిక పంచుకోవాలంటూ పవన్ పదే పదే  చాలెంజ్ చేస్తున్నారు. నాలుగేళ్ళుగా వారు అధికార, , విపక్ష స్థానాలలో ఉండి ఏపీకి ఏంచేశారో
 చెప్పాలని డిమాండ్ చేశారు. వారు ఒక వైపు ఉంటే రెండవ వైపు తానుండి జనం తరఫున ప్రశ్నిస్తానంటున్నారు జనసేనాని.
ఆ విధమైన పిలుపు జనాల మధ్య నుంచి పవన్ ఇవ్వడం బాగానే వర్కఔట్ అవుతోంది.  జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.
ఎటూ బాబు, జగన్ కలసి రావడం, పవన్ తో ఒకే వేదిక పంచుకోవడం అసలు కుదిరే   పనే కాదు. వాళ్ళు అలా రాలేరనే పవన్ ఇలా డిమాండ్ చేస్తున్నారు. వారు రాకపోవడానికి కారణం జనానికి జవాబు చెప్పలేకే అంటూ మరో విధంగా జనసేనాని ప్రచారం చేసుకునేందుకూ ఇది ఉపయోగపడుతోంది. అంటే ప్రజా సమస్యలపై వారి కంటే తనకే ఎక్కువ ఆసక్తి ఉందన్న సంకేతాన్ని జనంలోకి పంపించడం ఒకటైతే, వారిద్దరినీ చూసేశారు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని కోరడం మరో ఎత్తుగడ. ఇలా ఓ పధ్ధతి ప్రకారం  పవన్  దూసుకుపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: