వైసీపీ అధినేత జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భార్యల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ క్రమంలో జగన్ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు స్పందించారు. జగన్ను ఉద్దేశించి నాగబాబు మాట్లాడుతూ ఒక పార్టీకి అధినేత అయి ఉండి ఇలా మాట్లాడటం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

Related image

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో ప్రజలు నీరాజనాలు పడుతున్న నేపథ్యంలో దాన్ని ఓర్చుకోలేక కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగత దాడికి దిగుతున్నారని పేర్కొన్నారు. జ‌గ‌న్ నోరు జారార‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సున్నితంగా హెచ్చ‌రించారు. ఆయ‌న‌కు స‌రైన అవ‌గాహన‌ లేకుండా మాట్లాడార‌న్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లి విషయమై సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని నాగబాబు చెప్పారు.

Image result for pawan jagan nagababu

ఎవరినో పెళ్లి చేసుకుంటానని వదిలేయడం పవన్ చేయలేదన్నారు. ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి ఓ పాయంట్ కావాల‌ని అదిలేక‌నే వైవాహిక సంబంధం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ అలా మాట్లాడటం మంచిది కాదని నాగబాబు అన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ కచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నాగబాబు.




మరింత సమాచారం తెలుసుకోండి: