భారత్ కు దాదాపు 5వేల కిలోమీటర్ల దూరంలో దక్షిణ కొరియాకు చెందిన ఉలంగ్డో ద్వీపానికి సమీపంలోని సముద్రగర్భంలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది.  ఒక పాత నౌక తాలూకు శకలాలను పరిశోధకులు కనిపెట్టారు. అది 113 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన, రష్యా యుద్ధ నౌక ఈ దిమిత్రి డన్‌స్కోయ్‌. 

ఈ దిమిత్రి డన్‌స్కోయ్‌ యుద్ధనౌక, సముద్రంలో మునిగిపోయే సమయానికి ఇందులో నేటి మార్కెట్ దరల ప్రకారం ₹ 9.00 లక్షల కోట్ల విలువైన బంగారం ఉంది. 1905లో రష్యా కు జపాన్‌ కు మధ్య యుద్ధం జరగ్గా అందులో జపాన్‌ పై చేయి సాధించింది. రష్యా యుద్ధ నౌకలు ధారుణంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఈ యుద్ధనౌక  సైనికు లకు వేతనాలు తదితరాల కోసం భారీ ఎత్తున బంగారాన్ని తీసుకెళ్తోంది. మిగిలిన యుద్ద నౌకలు బాగా దెబ్బతినడంతో వాటి లోని వస్తు ధన బంగారం కూడా  ఇందు లోకే తరలించారు.
Image result for Dmitrii Donskoi warship sunk in 113 years
మొత్తం 5,500 బాక్సుల బంగారంతో నిండి ఉన్న ఈ నౌక జపాన్‌ దాడిని తప్పించుకుంది. అయితే, ఉలంగ్డో ద్వీపానికి సమీపంలో ఆ దేశ యుద్ధనౌకలకు దొరికిపోయింది. దాడిలో బాగా దెబ్బతింది. సైనికులు చనిపోయారు. నౌక మునిగిపోయింది. తర్వాత చాలా మంది వెతికినా దొరక లేదు. విఫల ప్రయత్నాలు ఎన్నో చేసి రష్యా పట్టించు కోవడం మానేసింది. 
Image result for Dmitrii Donskoi warship sunk in 113 years
ఈ మధ్య రష్యాలో ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరుగుతున్న సమయంలో ఆ దేశానికి చెందిన నౌకను దక్షిణ కొరియా సియోల్ కు చెందిన షినిల్ గ్రూప్ తన సముద్ర గర్భ అన్వేషణలో కనుగొంది. ఉలంగ్డో తీరానికి మైలు దూరంలో, 1400 అడుగుల లోతులో ఇది దొరికింది. గత కొన్నేళ్లుగా ఈ గ్రూపు నౌక కోసం సముద్ర గర్భంలో చిన్న పాటి సబ్‌మెరైన్లతో గాలిస్తోంది. సముద్ర గర్భంలో దొరికిన నౌక శకలాలు "దిమిత్రి డన్‌స్కోయ్‌"  శకలాలు అనే వారు నిర్ధారించారు. అంతేకాదు అందులో ఇనప్పెట్టెలు కూడా ఉన్నాయట. అయితే డైవర్లు వాటిని తెరవలేక పోయారని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
Image result for Dmitrii Donskoi warship sunk in 113 years
అంతా అనుకూలంగా సాగితే అక్టోబర్, నవంబర్‌ నాటికి ఈ నౌక శకలాలను పైకి తెస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఆ పసిడి సంపద  మాదంటే, మాదంటూ వాటాల రాజకీయం మొదలైంది. అది తమదని మొత్తం బంగారం మాకే దక్కాలని రష్యాలోని పలు గ్రూపులు డిమాండ్‌ చేయగా రష్యాకు తాము కొంత వాటాను మాత్రమే ఇస్తామని మిగతా దంతా మాదే నని సదరు కంపెనీ చెబుతోంది. 
Image result for Dmitrii Donskoi warship sunk in 113 years
ఇంతా చూస్తే లోగుట్టు ఆ బాక్సులకే ఎరుక ఎందుకంటే అవి తెరిస్తే గానీ అందరూ అనుకున్నట్లుగా అందులో బంగారం ఉందా? లేదా? అన్నది వెల్లడవుతుంది. అంత లో  ఈ వాటాల గొడవ మొదలైంది.  ఈ వార్త డైలీ టెలిగ్రాఫ్ ప్రచురించింది.

Image result for Dmitrii Donskoi warship sunk in 113 years

మరింత సమాచారం తెలుసుకోండి: