పాదయాత్రతో ఏపీ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించిన వైసీపీ అధినేత జగన్ అధికార టీడీపీని మరింత దూకుడుగా డీ కొట్టేందుకు  సరి కొత్త
వ్యూహాలకు పదును పెడుతున్నారు. రెపు (ఆదివారం) జగ్గంపేటలో జరిగే వైసీపీ నాయకుల కీలక భేటీలో జగన్ పలు నిర్ణయాలు తీసుకోబొతున్నారని టాక్. ఆ మీటింగ్ తోనే వైసీపీ క్యాడర్  లో జోరు పెంచేందుకు జగన్ రెడీ అయ్యారు. చంద్రబాబు సర్కార్ ని పూర్తిగా ఎండగట్టడం పైనే జగన్ ద్రుష్టి సారిస్తారని భోగట్టా.


భారీ యాక్షన్ ప్లాన్ :


ఇంతకాలం జగన్ ఒక్కడే పాదయాత్ర చేస్తూ వచ్చారు. పార్టీ శ్రేణులకు ఈ మధ్య కాలంలో పెద్దగా పని లేకుండా పోయింది. దాంతో వారంతా నిస్తేజంలో ఉన్నారు. మరో వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. దాంతో పార్టీకి పట్టిన మొద్దు నిద్రను వదిలించేలా జగన్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ఈ దెబ్బతో అటు పార్టీ గేరప్  అయి పరుగులు పెట్టడంతో పాటు ఇటు టీడీపీని గట్టిగా టార్గెట్ చేయడం అవుతుందని జగన్ భావిస్తున్నారు.


ఇక పల్లె బాట :


వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్ట్ 2 నుండి పల్లె నిద్ర పేరిట భారీ కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టబోతోంది. వంద రోజుల పాటు నాయకులంతా తమ ప్రాంతాలలోని పల్లెలకు వెళ్ళి అక్కడే బస చేయడం, పార్టీ గురించి ప్రచారం చేయడంతో పాటు, టీడీపీ మోసాలను కూడా ఎండగడతారు. ప్రత్యేక హోదా ఏపీకి రాకపోవడానికి చంద్రబాబే అసలైన కారణమని కూడా  చెబుతారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఏపీ ఎలా అన్యాయమైందో కూడా విడమరచి చెబుతారు. వైసీపీ వస్తే ఏం చేస్తుందో కూడా తెలియచేస్తారు.

 ఈ విధంగా టీడీపీకి గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా పార్టీని కూడా కదిలించేలా పల్లె నిద్ర ప్రొగ్రాం ఉంటుందని అంటున్నారు. ఈ లొగా జగన్ పాదయాత్ర పూర్తి అవుతుందని, ఇక ఆ వేడిని మరింత పెంచేలా జగన్ సైతం మరో మారు బస్సు యాత్ర చేస్తారని పార్టీ వర్గాల భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: