తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. ఓ పార్టీ అధినేతగా జగన్ నోరు జారడం తగదన్నారు. తన సోదరుడిని ఎదుర్కొనే దమ్ములేకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు.  వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.    తమ్ముడు పవన్ కళ్యాన్‌పై వైసీపీ అధినేత జగన్ నోరు పారేసుకోవటంపై జబర్తస్త్‌లో రోజా పార్టనర్‌, పవన్ సోదరుడు అయిన నాగబాబు తీవ్రంగా ఖండించారు. జనసేన అధినేత పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి మోసం చేయలేదన్నారు. ఇద్దరి భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది భార్యాభర్తల మధ్య జరిగిన విషయమని.. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని.. దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య గానీ, రేణూ దేశాయ్ గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు.  వైవాహిక జీవితంలో కూడా పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, అందువల్లే అలా మాట్లాడుతున్నారన్నారు.కల్యాణ్‌ను టీడీపీ, వైసీపీ తక్కువ అంచనా వేశాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో పవన్ బలమైన రాజకీయ శక్తిగా మారుతున్నాడన్నారు.

మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు .  సీఎం చంద్రబాబును ఎదుర్కోలేకే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోతున్నారన్నారు. దమ్ము, ధైర్యం, శక్తి జగన్‌కు లేవన్నారు. చంద్రబాబును ఎదుర్కోవాలని జగన్‌కు సూచించారు. జగన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నారని.. తన జీవితం తెరిచిన పుస్తకమన్నారు. ఏదీ దాచలేదన్నారు. చాలా మంది జీవితాల్లో కనిపించని పేజీలు ఉంటాయని.. కానీ తన జీవితంలో దాపరికాలు లేవన్నారు.

తన జీవితంపై విమర్శలు చేసే వారికన్నా.. అన్ని కోణాల్లో తను అందరికంటే బెటర్ అన్నారు. కూర్చోబెట్టి వ్యక్తిగత విమర్శలు చేయాలంటే చాలా చేయగలనని.. ఊపిరితీసుకోలేనంత, తట్టుకోలేనంతగా చేయగలనని పవన్ అన్నారు. జగన్ వ్యాఖ్యలు ఆయన అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయన్నారు. ఏపీలో పవన్ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాడని, ఆయనను తక్కువగా అంచనా వేయొద్దని వైసీపీ, టీడీపీలను నాగబాబు హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: