పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్న సంగతీ తెలిసిందే. అక్కడ విద్యార్థుల తో కలిసి మీటింగ్ లో పాల్గొన్నాడు. వారితో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నాడు. అయితే పవన్ తనకు చిన్నప్పుడు జరిగిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలియజేశాడు. మీ జీవితంలోని చేదు అనుభవాల గురించి చెప్పండి అని ఓ విద్యార్థిని అడగ్గా.... పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తాను చిన్న తనంలో ఓసారి జీవితం మీద విరిక్తి పుట్టి పిస్టల్‌తో కాల్చుకుని చనిపోవాలనుకున్నానని, అపుడు ఇంట్లో వాళ్లు విషయం గుర్తించి తనను ఆ పరిస్థితి నుండి బయట పడేశారు.

Image result for pavan janasena

తర్వాత 'పంజా' సినిమా సమయంలో అలాంటి పరిస్థితే ఎదురైంది అంటూ... అందుకు గల కారణాలు వివరించే ప్రయత్నం చేశారు. చిన్నతనంలో నాకు బాగా చదుకోవాలనే కోరిక ఉండేది. కానీ పియూసీ రాయలేక ఇంటికి వచ్చేసిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ నాకంటే చదువులో ముందుకు వెళ్లారు. నేనేమో అలాగే ఉండిపోయాను. టీనేజ్‌లో మన ఫ్రెండ్స్ ఆరు నెలలు ముందుకెళ్లినా మనకు చాలా వెనకబడిపోయామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే ఫీలింగుతో డిప్రెషన్లోకి వెళ్లి చనిపోవాలనుకున్నాను.

Image result for pavan janasena

మా ఇంట్లో అపుడు పిస్టల్ ఉండేది. దాంతో కాల్చుకుని చనిపోవాలనుకుని లోడ్ చేసి పెట్టుకున్నాను. దానికంటే ముందు ఇంట్లో వారితో అనుకోకుండా నేను మీకు రెండు గంటలకంటే ఎక్కువ సేపు కనిపించను అని ఓ మాట అన్నాను. దాంతో వారికి అనుమానం వచ్చి వెతకడంతో నా వద్ద నుండి తుపాకి లాక్కుని... క్లాస్ పీకారు. ఆ తర్వాత ఆ పరిస్థితి నుండి బయట పడ్డాను.

మరింత సమాచారం తెలుసుకోండి: