ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదు, అదే రాజకీయం, తెలుగునాట ఆ టైపు రాజకీయాన్ని చంద్రబాబు బాగా పండించారు. నిజం చెప్పకుండా తెలంగాణాలో అక్కడి పాట పాడుతూ ఏపీకి రాగానే విభజన అన్యాయమంటూ కన్నీళ్ళు కార్చారు. ఆ ఒక్కటే కాదు, హామీల విషయంలోను చేతికి ఎముక లేనట్లుగా ఇస్తూ పోయారు. అవి అమలవుతాయా. తన అధికార పరిధిలో ఉందా అన్న ఆలొచనే పెట్టుకోకుండా కేవలం ఓట్ల కోసం ఏ రోటి దగ్గర ఆ పాట పాడారు. ఆ ఫలితమే నేటికీ కాపులకు రిజర్వేషన్లు అన్న అతి పెద్ద అబద్దపు హామీగా ఏపీ చరిత్రలో నిలబడింది.


డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన జగన్:


కాపుల ఇలాకాలో, వేలాది జనం మధ్యన నిలబడి వారి సెంటిమెంట్ అంశాన్ని ఎత్తుకోవడానికే రాజకీయ నాయకుడు అన్న వాడు నిలువెల్ల భయపడిపోతాడు. అలాంటిది జగ్గంపేటలో ఈ రోజు జరిగిన మీటింగ్ లో జగన్ ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టారు. మనసులో ఏమీ దాచుకోకుండా అసలు నిజం చెప్పేశారు. కాపుల రిజర్వేషన్ అనే అతి సున్నితమైన అంశంలో వైసీపీ స్టాండ్ ఏంటన్నది వివరించి మరీ చెప్పారు. నిజంగా జగన్ మాగాడిలా అసలు విషయం చెప్పారు.


అది రాష్ర పరిధి కాదు, సుప్రీం తీర్పు ఉంది :


రిజర్వేషన్ల అంశం రాష్త్ర పరిధిలోనిది కానే కాదన్న నిజాన్ని జగన్ చెప్పారు. పైగా యాభై శాతం పరిధికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీం కోర్టు తీర్పును జగన్ ఉటకించారు. తాను చంద్రబాబు లా తప్పుడు హామీలు ఇచ్చి చేయలేని దాని చేయగలను అని చెప్పలేనని జగన్ అన్నారు. పైగా కాపులకు తాను చెయాల్సిందంతా చేస్తానని భరోసా కూడా ఇచ్చారు. తాను మాట తప్పే వాడిని కాదన్నది అందరికీ తెలుసునని కూడా చెప్పుకున్నారు.


అర్ధం చేసుకుంటారా :


జగన్ నిజం చెప్పారు, చంద్రబాబు అబద్దపు హామీ ఇచ్చారు. ఈ రెండూ ఇపుడు కాపులు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల ప్రజల ముందు ఉన్నాయి. రేపటి ఎన్నికలలో మోసం చేసిన టీడీపీ కి కాపులు ఎట్టి పరిస్థితులలో ఓటేయరాదనుకుంటున్నారు.  మరి నిజం చెప్పి మీ మేలు చూస్తానని చెబుతున్న జగన్ వైపు కాపులు ఉంటారా  అంటే ఉంటారనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే కాపులకు నిజమేంటో అర్ధమైంది. మళ్ళీ బాబు కూడా రెండవసారి ఇలాంటి హామీ ఇవ్వలేడు కూడా.  సో జగన్ ఈ విషయంలోచెప్పాల్సింది  చెప్పి కాపులకు చేరువ అయ్యాడనే అనుకోవాలి. జగన్ ని ఈ విషయంలో ఇరికిద్దామని కాచుకు కూర్చున్న టీడీపీకి కూడా ఈ క్లారిఫికేషన్  సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళది కక్క లేక మింగ లేక చందాన పరిస్థితి కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: