తూర్పు గోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్ పై క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదన్నారు జగన్. తూ.గో జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాపు రిజర్వేషన్ సమస్య మాట్లాడారు.  ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన.. ఏపీలోని ప్రధాన సామాజికవర్గమైన కాపుల రిజర్వేషన్ అంశమై జగన్ తన నిర్ణయాన్ని సుస్పష్టంగా కుండబద్దలు కొట్టారు. నేను చేయగలిగిందే చెబుతాను, చేయలేనిది చెప్పే అలవాటు నాకు లేదని చెప్పిన ప్రతిపక్ష నేత.. కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని తెలిపారు.  నేను చేయగలిగింది మాత్రమే చెబుతాను. చేయలేనిది నాకు చెప్పే అలవాటు లేదని స్పష్టం చేశారు.
ys jagan mohan reddy clarifies his stand about kapu reservations
కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలు ఉంటాయి, కొన్ని రాష్ట్ర పరిధి కాని అంశాలు ఉంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్ సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం దాటితే సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలో లేని అంశాలు కాబట్టి వీటి మీద నేను ఏమి చేయలేను. అందుకే మీ అందరి సమక్షంలో నేను చేయలేను అని మొహమాటం లేకుండా చెబుతున్నాను.  50 శాతం దాటడంతో రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిధిలో లేవన్నారు.

ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.  నేను చేయలేను కాబట్టి మాటివ్వలేక పోతున్నానని చెప్పిన జగన్.. కాపులకు అన్యాయం జరుగుతుందని పోరాటం మొదలుపెట్టిందే తానని తెలిపారు. ‘కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారు.గత ఎన్నికల ముందు కాపులను బీసీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని తెలుగు దేశం పార్టీ హామీ ఇచ్చింది. 
రెండు వైపులా నష్టపోకుండా
కాపు సోదరులకు కూడా ఇదే చెబుతున్నాను. ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడతా.. చేయగలిగేవే చెబుతాను. కొన్ని రాష్ట్ర పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు కాబట్టి.. రిజర్వేషన్ల విషయంలో నేను చేయలేకపోతున్నానని చెబుతున్నాను. కానీ మొట్ట మొదట కాపులకు అన్యాయం జరిగిందని స్వరం వినిపించింది వైసీపీనే అని చెబుతున్నాను. చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ. వెయ్యి కోట్లు కోట్లు కేటాయిస్తానని చెప్పారు. చంద్రబాబు కంటే రెట్టింపు నిధులు కేటాయిస్తానని మాట ఇస్తున్నాను" అని వైసీపీ అధినేత జగన్ తేల్చిచెప్పేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: