పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో నేను పిరికివాడిని కాదు దమ్ము దైర్యం ఉంది. అని ఎక్కువగా సినిమా డైలాగ్స్ కొడుతున్నాడు. జగన్ మీద కూడా వారసత్వ రాజకీయాలు అని విమర్శలు చేస్తున్నాడు. దీనితో జగన్ అభిమానులు దిమ్మ తిరిగే పోస్ట్ ఒక్కటి సోషల్ మీడియా లో పెట్టారు. అందులో పిరికివాడు ఎవరు అని పవన్ ను ప్రశ్నించారు. అటు జగన్, ఇటు లోకేష్ వారసత్వాలను పవన్ ప్రశ్నించేస్తున్నాడు, మరి కేటీఆర్‌ను ఎందుకు అనలేకపోతున్నాడు? అనేది చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఇక క్రికెట్ చూసేవాడల్లా అలా ఆడాలి, ఇలా ఆడాలని అంటూ ఉంటారు. పవన్ కూడా ఆ కేటగిరికే వస్తాడని చెప్పడం బ్రహ్మాండమైన సెటైర్. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ పోస్టు ఇలా ఉంది. 

Image result for pavan kalyan janasena

కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అని దీక్ష చేస్తున్న ముద్రగడ కుటుంబం స్త్రీలను దుర్భాషలాడుతూ, కొడుకును ఈడ్చికొడుతూ , ముద్రగడ లం..కొడుకుని లాగికొట్టండి అని లోకేష్ ఆదేశాలు(ముద్రగడ చెప్పింది) ఇచ్చిన కనీసం నోరుతెరిచి ఇదేమి అన్యాయం బాబూ అని నిలదీయలేని నీకన్నా పిరికివాడు ఎవరు?లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలుస్తున్నారా అని విలేకరి అని అంటే నేను పిలవాలంటే అతనికి ఒక స్టేటస్ ఉండాలి, ఎవరిని పడితే వారిని పిలవను అని TDP MLA బాలయ్య అన్నరోజున నోరు తెరవని నీ కంటే పిరికివాడు ఎవరు ?మీ దేవుడు అన్నయ్య ఖైదీనెంబర్ 150 డియో ఫంక్షన్ కు విజయవాడ లో పర్మిషన్ ఇవ్వలేదు ఇదేమిటి అని అడగలేని నీకంటే పిరికివాడు ఎవరు?

Image result for pavan kalyan janasena

గెలిచిన YCP MLAలకు కాకుండా ఓడిపోయినా టీడీపీ MLAలకు నియోజక వర్గ అభివృద్ధి డబ్బులు 2కోట్లు సీటుంటే ఇదేమి అన్యాయం అని బాబును అడగలేని నీవు పిరికివాడివి కాదా?మాట్లాడితే YS రాజశేఖర్ రెడ్డి జగన్ లు ఫ్యాక్షనిస్ట్ లు అంటున్నావు. వాళ్ళు నిజంగా ఫ్యాక్షనిస్ట్ లు అయితే నీవు ఇలా మాట్లాడుతూ ఉండేవాడివా?నిజంగా YS మంచి వాడు కాకపోతే YS ను రెండవసారి ప్రజలు CM గా ఎన్నుకొనేవారా? మీ అన్న చిరంజీవి సొంత వూరు మొగల్తూరు పక్కన ఉన్న అత్తగారి ఊరు పాలకొల్లు లో ఎందుకు ఓడిపోయాడో ఆత్మ విమర్శ చేసుకో.జగన్ ది వారసత్వం- అంటున్నావు మరి చిరంజీవి పేరు చెప్పుకొని నీతో పాటు ఒక అరడజను మంది హీరోలు ఎలా వచ్చారు సినీ పరిశ్రమలోకి? చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు నీకు యువరాజ్యం ప్రెసిడెంట్ పదవి వారసత్వనగా కాకా ఎలా వచ్చింది?



మరింత సమాచారం తెలుసుకోండి: