Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 12:23 pm IST

Menu &Sections

Search

మంత్రి దేవినేని ఉమా ఆ త‌ప్పు చేసి దొరికిపోయాడా..?

మంత్రి దేవినేని ఉమా ఆ త‌ప్పు చేసి దొరికిపోయాడా..?
మంత్రి దేవినేని ఉమా ఆ త‌ప్పు చేసి దొరికిపోయాడా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై ఆరోప‌ణ‌లు చుట్టుముడుతున్నాయి. ఆయన ఇప్ప‌టికే చాలా త‌ప్పులు చేశార‌ని, అవే ఆయ‌న‌ను ఓడించేందుకు రెడీ అవుతున్నాయ‌ని సొంత పార్టీలోని కొంద‌రు నేత‌లు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు అత్యంత విధేయుడు, స‌న్నిహితుడు, మంత్రి వ‌ర్గంలో నెంబ‌ర్ 5లో కొన‌సాగుతున్న వారు అయిన దేవినేనిపై ఎందుకు ఈ కామెంట్లు వ‌స్తున్నాయి? ఆయ‌న నిజంగానే ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నాడా? వ‌ంటి కీల‌క అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన దేవినేని ఉమాకు చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. అంతేకాదు, ప్రాజెక్టుల పై అధ్య‌య‌నం కూడా చేయించారు. 

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టును ప్ర‌ధానంగా ఎడాప్ట్ చేసుకోవ‌డం, 2019 ఎన్నిక‌ల‌కు దానినే ఓ ఆయుధం గా వాడుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం తెలిసిందే. అయితే, ఇది పూర్త‌య్యేందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని గ్ర‌హించి ప‌ట్టిసీమ‌ను నిర్మించేందుకు రెడీ అయింది. అయితే, ఈ ప్రాజెక్టును పూర్తిగా దేవినేని చేతుల్లోనే పెట్టారు చంద్ర‌బాబు ఇలా అన్ని విధాలా దేవినేనికి బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే ఇప్పుడు పార్టీని ముంచింద‌ని అంటున్నారు పార్టీలోని సీనియ‌ర్లు. త‌న‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రాధాన్యాన్ని దేవినేని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడ‌ని, దీంతో పార్టీలోని చాలా మందిని ఆయ‌న చిన్న చూపు చూశార‌ని, ఫ‌లితంగా ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో దాని ప్ర‌భావం పార్టీపై ప‌డుతోంద‌ని అంటున్నారు. 

andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja

దేవినేని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇక్క‌డి నుంచే టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే, ఈయ‌న గెలుపు అంత ఈజీ కాద‌ని తేలిపోతోంది. ఇక్క‌డి స్థానిక టీడీపీ నేత‌లే దేవినేనికి వ్య‌తిరేకంగా చాప‌కింద నీరులా ప్ర‌చారం చేయ‌నున్నార‌ని, దేవినేనికి వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఫుల్ క్యాంపెయిన్ న‌డుస్తోంద‌ని అంటున్నారు.

అవినీతిలో ఫ‌స్ట్ ఉన్న దేవినేనికి ఓటు వేయొద్దు.. ప‌ట్టిసీమ‌తో దేవినేని పొట్ట నింపుకున్నాడు! వంటి స్లోగ‌న్ల‌ను ఇప్ప‌టికే వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన నాయ‌కుడుగా వసంత కృష్ణ‌ప్ర‌సాద్ రంగంలోకి దిగుతుండ‌డం కూడా దేవినేనికి వ్య‌తిరేక అంశంగా మారిపోతోంది. వ‌సంత ఫ్యామిలీ టీడీపీ నుంచే వ‌చ్చి ఉండ‌డం, క‌మ్మ‌సామాజిక వ‌ర్గాన్ని అన్ని విధాలా ఆక‌ర్షించ‌డం వంటి కీల‌క అంశాలు దేవినేనికి మైన‌స్‌గా మార‌నున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


andhrapradesh-tdp-cm-chandrababu-naidu-ysrcp-ys-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.