వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా లో దిగ్విజయంగా కొన సాగుతుంది. అధికార పక్షమైన టీడీపీ కుటీలా రాజకీయాలను ఎండగడుతూ ప్రజల తో కలిసి పోతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగి పోతున్నాడు. అయితే పోయిన ఎన్నికల్లో తూగో, పాగో రెండు జిల్లాలు టీడీపీ వైపు నిలబడ్డాయి. దీనితో జగన్ కు అధికారం దూరమయిందని చెప్పాలి . 

Image result for jagan padayatra

ప్రత్యేకహోదాపై తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిన వెంటనే టీడీపీపై జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ టీడీపీ-బీజేపీల తీరుపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ఉన్న బంధం బయటపడిందని, వీరిద్దరిదీ ఫెవికాల్‌ బంధంగా స్పష్టమయ్యిందని వ్యాఖ్యానించారు.

Image result for jagan padayatra

చంద్రబాబుతో తమబంధం తెగిపోయే ప్రసక్తేలేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పిన మాటలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. అవిశ్వాసం నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలసి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నట్టు మరోసారి స్పష్టమైందని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పంపీలు డ్రామాలు ఆపి తక్షణం పంపీ పదవులకు రాజీనామా చేస్తే, రాష్ట్రానికి చెందిన పంపీలందరూ కలసి నిరాహార దీక్షచేస్తే దేశం అంతా మనవైపు పందుకు చూడదని జగన్‌ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: