జగన్ మాట్లాడింది తప్పైతే... నువ్వు జగన్ ను మాట్లాడింది కూడా తప్పే పవన్?

పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం మీద జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ తోలు తీస్తా అని ఒక సినిమా డైలాగ్ చెబుతున్నాడు. మరీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం తప్పైతే నీ తోలు తీస్తా అని మాట్లాడటం కూడా తప్పే. వ్యక్తి గత విమర్శలు చేయడం అనేది ఇప్పటి రాజకీయాల లో సాధారణం అయిపొయింది. ఇంతకు ముందు కూడా చిరంజీవి మీద టీడీపీ నేతలు ఘోరమైన విమర్శలు చేసినారు.
చివరికి జగన్ జైలులో ఉన్నప్పుడు భార్య ఆయనను కలవడానికి వెళితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎంత నీచమైన ప్రకటన చేశారో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక మెగాస్టార్ చిరంజీవిపై అప్పట్లో టీడీపీ నేతలు ఎంత అసహ్యమైన వ్యాఖ్యలు చేశారో ఒకసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో పవన్‌కళ్యాణ్‌పై టీడీపీ నేతలు ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నది గమనిస్తున్నాం. రెండురోజుల క్రితం ఒక టీడీపీనేత పవన్ కళ్యాణ్‌ను చిల్లరనేత అని ఎద్దేవాచేశారు.
గతంలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ నేతలు కాని, చంద్రబాబు వర్గం వారు కాని ఎన్నిరకాల ప్రచారాలు చేశారో అప్పటి రాజకీయాలు చూసినవారికి వేరే చెప్పనవసరంలేదు. నిజమే వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సరికాదు. కాని వర్తమాన రాజకీయాలలో అవి జరుగుతూనే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తోలు తీస్తానని హెచ్చరించిన తీరు కూడా పరిశీలించాలి. చూడడానికే మెత్తగా కనిపిస్తానని, తేడావస్తే తోలు తీస్తానని హెచ్చరించారు.