జగన్ పవన్ పై విమర్శలు చేసి దాదాపుగా వారం కావస్తోంది. అందరూ దాని పైన రియాక్ట్ అయ్యాక తాపీగా కాపు నాయకుడు ముద్రగడకు పవన్ గుర్తుకొచ్చారు. అదీ జగన్ కాపులకు రిజర్వేషన్ కుదరదని స్పష్టంగా తేల్చేశాక ముద్రగడ పవన్ పక్కకెళ్ళి నిలబట్టారు. పవన్ ని జగన్ అవమానించారట. అలా కామెంట్స్ చేయడం తప్పంట. ఇన్నాళ్ళకా ఇది తప్పు అని ముద్రగడకు తెలిసింది మరి.

 

అబద్దాలే తీపిగా ఉంటాయా :


కాపులకే కాదు, అసలు యాభై శాతం పైగా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగే పని కాదని తెలిసి చంద్రబాబు ఓ అబద్దపు హామీ ఇచ్చారు. నాలుగేళ్ళు టైం పాస్ చేసి మొక్కుబడి తంతుగా ఓ విన్నపం అసెంబ్లీ తరఫున కేంద్రానికి చేసి ఊరుకున్నారు. అలా జగన్ కూడా ఓట్ల కోసం హామీ ఇస్తే ముద్రగడ లాంటి వాళ్ళకు హ్యాపీనా. యాభై శాతం దాటిన  రిజర్వేషన్లు చెల్లవని, కోర్టు కొట్టేస్తుందని మంత్రిగా పనిచెసిన సీనియర్ రాజకీయ  నాయకుడు ముద్రగడకు తెలియదనుకోవాలా.

 

జనసేన వైపు చూపా :

 

ఏపీలో రెండు ప్రధాన పార్టీలూ కాపుల విషయంలో అన్యాయం చేశారంటున్న ముద్రగడ మరి తన పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇప్పటికైతే జనసేన నాయకుడు పవన్ ని సపోర్ట్ చేసిన ముద్రగడ రాబోయే కాలంలో ఆయన వెంట నడుస్తాడేమో చూడాలి. నిజానికి కాపులు మొత్తం ముద్రగడ వెనక ఉన్నారనుకోవడమూ పోరపాటేనేమో.


కాకినాడ కార్పోరేషన్, నంధ్యాల ఉప ఎన్నికల సందర్భంగా ముద్రగడ టీడీపీని ఓడించమని పిలుపు ఇచ్చినా మంచి మెజారిటీతో  ఆ పార్టీ గెలిచిన సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఆలొచించుకున్నపుడు ముద్రగడ జనసేనలో చేరితే ఆ పార్టీకి ఎంతవరకూ ఉపయోగమో కూడా చూడాలి. అలాగే కాపుల రిజర్వేషన్ పై పవన్ వైఖరి కూడా ఇపుడు తేలాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: