తమిళనాడు ఓ ప్రత్యేకమైన రాష్ట్రం, అక్కడ ఎమోషన్లదే అగ్ర పీఠం, సినీ, రాజకీయ నాయకులపై తమ అభిమానాన్ని వారు గుండెల్లో దాచుకుంటారు. వారికి ఏమై నా జరిగిందని చిన్న వదంతి వస్తే చాలు ఆ గుండెలు బద్దలైపోతాయి. నిన్నటి జయలలిత ఉదంతమైనా, నేటి కరుణానిధి వ్యవహారమైనా తమిళ తంబీల తీరు ఇది. నిజాలు చెప్పల్సిన చోట కొన్ని మీడియా సంస్థలతో పాటు, సోషల్ మీడియా అత్యుత్సాహమే ఇలా వదంతులకు కారణమవుతోంది. ఫలితంగా అమాయక అభిమానుల గుండెలు ఆగిపోతున్నాయి.

 తనువు చలిస్తున్నారు :


తమ అభిమాన నేత కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతులతో తట్టుకోలేని అభిమానులు తనువు చాలిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికి ముగ్గురు అభిమానుల గుండె ఆగిపోయింది. కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వర్గాలు హెల్త్  బులెటిన్ విడుదల చేయడంలో చేసిన జాప్యం వదంతులకు కారణమవుతోంది. దాంతో తమిళనాడు అంతా టెన్షన్ వాతారవణం నెలకొంది. పెద్దాయనకు ఏదో అయిందని కొన్ని మీడియాలలో చెడుగా న్యూస్ రావడంలో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

  

నిలకడగానే :

 

నిజానికి కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని కావేరీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెట్ లో పేర్కొన్నాయి. ఆయన క్రుత్రిమ శ్వాస నుంచి సొంతంగా శ్వాస పీల్చుకునే స్థితికి వచ్చారని తెలిపారు. దీంతో డీఎంకే అభిమానులు కొంత వరకూ ఊరట చెందారు. దీఎంకే సీనియర్ నాయకుడు ఏ రాజా మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యం కుదుటపడుతోందని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు.


కాగా 94 ఏళ్ళ కరునానిధి తమిళనాటనే కాదు, దేశంలోనే సీనియర్ నాయకుడు. ఎన్నో యుధ్ధాలను చూసిన వీర యోధుడు. తమిళనాట ఆయన రాజకీయ భూమిక ఎన్నతగినది. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితం పండించుకున్న విలక్షణ నాయకుడు. నాటి తరానికీ, నేటి తరానికి చివరి వారధి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: