డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కోలుకుంటున్నందున ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, కార్యకర్తలు సంయమనం పాటించాలని, డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విజ్ఞాప్తి చేశారు.  ఇదిలా ఉంటే.. నగరం మొత్తం పోలీసులు భారీగా పోలీసులు మోహరించడంతో పాటు ఎక్కడికక్కడ బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో మీడియా కూడా జరగరానిదేదో జరిగిందని పసిగట్టింది. రాత్రి 11.30 గంటల వరకు ఈ గందరగోళం కొనసాగింది. 


డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వెలువడుతుండడంతో రాష్ట్ర ప్రజల్లో ఉద్వేగం, డీఎంకేలో ఉద్రేకం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. . ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలతో కావేరీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర జ్వరం, మూత్రనాళంలో ఇన్పెక్షన్‌ కారణంగా మూడు రోజుల క్రితం స్థానిక ఆళ్వారుపేటలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.   


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం నేరుగా కరుణ వార్డులోకి వెళ్లి ఆయన్ని చూశారు.  కరుణ కుటుంబీకులంతా తీవ్ర ఆవేదనలో ఆస్పత్రికి చేరారు. ఒక్కొక్కరిగా వరుసగా ఆస్పత్రికి వస్తుండడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.  అదే సమయంలో అక్కడికి కార్యకర్తలు భారీగా తరలిరాగా, పోలీసులు కూడా అదే స్థాయిలో మోహరించారు. ప్పటికే కుటుంబసభ్యులు పలుమార్లు కరుణానిధిని పరామర్శించారు. 


కాసేపట్లో సీఎం పళని స్వామి కూడా కావేరీ ఆస్పత్రికి రానున్నారు. అటు కరుణ ఆరోగ్య పరిస్ధితిని జీర్ణించుకోలేని అభిమానులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరుణ ఆరోగ్య పరిస్దితిపై టీవీలో వార్తలు చూస్తూ ఇద్దరు డీఎంకే నేతలు గుండెపోటుతో చనిపోయారు. మరో కార్యకర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు టెన్షన్ పడవొద్దని ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: