వైసీపీ అధినేత జగన్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే అనేక కొండలు లోయలు గుండా అనగా ఓటమి గెలుపు అనే ఎత్తుపల్లాల గుండా వెళ్ళటం జరిగింది. తన తండ్రి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మరణించిన సమయంలో ఎంపీగా ఉన్న జగన్ ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లి సొంతపార్టీ వైయస్ఆర్సీపీ నిర్మించి అనేక సంచలనాలు రాజకీయాలలో సృష్టించారు. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాలు వాళ్ల కొంతమంది స్వార్ధ రాజకీయాల దృష్టిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు గురవడం జరిగింది.

Image may contain: 6 people, people smiling, people standing, shoes and outdoor

ఈ క్రమంలో ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మధ్య మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర పోటీ నెలకొంది. ఆ క్రమంలో అమలుచేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యంగా కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి చంద్రబాబు కాపు సామాజికవర్గానికి చెందిన వారిని దారుణంగా మోసం చేశారు.

Image may contain: 9 people, people smiling, people sitting

ఇదిలా ఉండగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లాలలో పాదయాత్ర ముగించుకుని జగన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతమైన జగ్గంపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ కాపులకు కంచుకోటగా అనబడే జగ్గంపేటలో జరిగిన సభలో కాపు రిజర్వేషన్లపై మీ వైఖరి చెప్పాలంటూ కొందరు కాపు యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై స్పందించిన జగన్మోహాన రెడ్డి "ఈ అంశం కేంద్రం పరిధిలోనిది వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రస్తుత కాపు కార్పొరేషన్ కు మాత్రం ఇప్పుడు ఉన్న నిధుల కంటే రెట్టంపు నిధులు ఇస్తాను" అని స్పష్టం చేసారు.

Image may contain: 9 people, people smiling, people sitting and outdoor

ఈ మధ్యనే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ మోహాన రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు వివాదం రేపాయ్. పవన్ కులస్థులైన కాపులు జగన్ కు దూరమవుతారని పలు కథనాలు కూడా వచ్చాయ్. అయినా వాటికి వెరవకుండా జగన్ సాధ్యాసాధ్యాలను అదే కాపు కులస్థులకు వారి కంచుకోటలోనే చెప్పారు. మొత్తంమీద చూసుకుంటే  రాజకీయాలలో ప్రజలను మోసం చేస్తున్న తలపండిన నేతలకు తలనొప్పిగా తెప్పిస్తూ...స్వచ్ఛమైన రాజకీయాలకు జగన్ నాంది పలుకుతున్నారని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.




మరింత సమాచారం తెలుసుకోండి: