హామీలు ఇవ్వడమే తప్ప ఎపుడూ గుర్తుపెట్టుకోవడం టీడీపీకి అలవాటు లేని వ్యవహారం. అందుకు పెద్ద ఉదాహరణ ప్రత్యేక హోదా అంశమే. మోడీతో కలసి ఊరూరా తిరిగి హోదా పదిహేనేళ్ళు సాధిస్తామంటూ పెద్ద గొంతుతో చెప్పిన బాబు గారిని నాలుగేళ్ళు గడిచాక కానీ హోదా గుర్తుకురాలేదు. అదీ వైసీపీ పోరాటాల ఫలితంగానే సుమా. ఇపుడు కాపుల రిజర్వేషన్ అంశం కూడా అలాంటిదే. జగన్ జగ్గయ్యపేటలో ఇలా అన్నారో లేదో అలా టీడీపీ అలెర్ట్ అయిపోయింది. 


అనకాపల్లి ఎంపీ హడావుడి :


అవిశ్వాసం తీర్మానం సందర్భంగా అన్ని సమస్యలూ ఏకరువు పెట్టిన టీడీపీ ఎంపీలకు కాపులు గుర్తుకు రాలేదు. తెల్లారిలేస్తే మోడీపై రంకెలేసే బాబులు, చినబాబులకు కాపుల బిల్లు మోడీ వద్ద పెండింగులో ఉందన్నది అసలు ఎరుకలోనే లేదు. మరి జగన్ కాపులకు రిజర్వేషన్లు కుదిరేది కాదని ఇలా అన్నాడో లేదో  అలా అందిపుచ్చుకుంది టీడీపీ. పార్లమెంట్లో ఈ రోజు కాపుల అంశం ప్రస్తావించమని బాబే స్వయంగా పురికొల్పారు. పార్లమెంట్లో ఈ రోజు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కాపులకు అయిదు శాతం విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందని లోక్ సభలో ప్రస్తావించారు. ఆ బిల్లుని కేంద్రం ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.



మీడియాతో మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్లపై కేంద్రంపై వత్తిడి తెస్తామని, న్యాయం జరిగేవరకూ ఊరుకోమని చెప్పారు. మొత్తానికి కాపుల విషయంలో ఏ మాత్రం న్యాయం జరిగినా ఆ క్రెడిట్ ఇపుడు టీడీపీది కాదు, దాన్ని కదిలించిన జగన్ దే అవుతుంది. ఎనీ డౌట్స్ ..?


మరింత సమాచారం తెలుసుకోండి: