సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన ‘రంగం’ కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగింది. బోనాల తర్వాత రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని భవిష్యత్తును చెప్పిన స్వర్ణలత.. ఈ ఏడాది బంగారు బోనం కొంత సంతోషం, కొంత దుఃఖం కలిగించిందన్నారు.
Image result for అమ్మవారు భవిష్యవాణి
‘ఈ ఏడాది భక్తుల్లో సంతోషం కనపడలేదు. ఆడపడుచులు క్షోభిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తున్నామనుకుంటున్నారుగానీ కీడు చేస్తున్నారు' అని వెల్లడించారు. ఈ సంవత్సరం ఉత్సవాలు తనకు సంతోషాన్ని కలిగించలేదని వ్యాఖ్యానించింది. ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తే... సంతోషం లేదని ఎలా చెబుతావమ్మా? అని అడుగగా, తనను ప్రశ్నించడానికి నువ్వెవరని అమ్మ గద్దించేసరికి అక్కడున్న భక్తులంతా నివ్వెరపోయారు. మీరు నన్ను ప్రశ్నించే గొప్పవాళ్లా అని కన్నెర్రజేశారు. 
Image result for అమ్మవారు భవిష్యవాణి భోనాలు
ఆడపడుచులు శోకిస్తూ వెళుతున్నారని, ఈ సంగతిని ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.   ప్రజలంతా సంతోషంగా ఉండాలని, తాను న్యాయం వైపు ఉండి దుష్టులను శిక్షిస్తానని చెప్పారు. ప్రజలంతా తన బిడ్డలేన్న ‘మాతంగి’.. ఈ ఏడాది కోరినన్ని వర్షాలుంటాయని, పాడిపంటలు పండుతాయని అన్నారు.
Image result for అమ్మవారు భవిష్యవాణి
నా ఆశీర్వాదం అందరికీ ఉంటుంది...నాకు మాత్రమే మొక్కులు పెట్టడం కాదు.. ప్రజలను సంతోషపెట్టండి. ఇకనైనా నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి' అని అన్నారు. ఇటీవల కాలంలో హిందూ మతాన్ని, హైందవ జాతిని కించపరుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉందని, ఇటువంటి వాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తావని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "నేను న్యాయం పక్షానే నిలుస్తాను. ఉజ్జయిని మహంకాళినిరా నేను. ఎవరెన్ని మాటలన్నా జాతికి రక్షగా నేనుంటా. తప్పనిసరిగా శిక్షిస్తా నేను. శిక్షిస్తాను. రక్షిస్తాను కూడా" అని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: