బిగ్ బాస్ 2 ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఎవరికీ అర్ధం కానీ క్వశ్చన్ పేపర్ లా తయారైంది. ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో తెలియడం లేదు.  ఎందుకు మళ్ళీ తిరిగి వస్తున్నారన్న దానికి క్లారిటీ లేదు. అయితే బిగ్ బాస్ లో సభ్యుల తీరు పట్ల కూడా నాని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించినప్పటి బిగ్‌ బాస్‌ రియాల్టీ షో పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటి కంటెస్టెంట్స్‌కి కాస్తంత మెచ్యూరిటీ ఎక్కువ. ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో ఆ మెచ్యూరిటీ కన్పించడంలేదు. ఎంతైనా యంగ్‌ టైగర్‌ కదా.. ఆయన స్టార్‌డమ్‌కి కాస్తంత వాల్యూ వుండేది బిగ్‌ హౌస్‌లో.

Image result for nani bigg boss

ఇప్పుడు ఆ 'వాల్యూ' నానికి, బిగ్‌ హౌస్‌లోని హౌస్‌మేట్స్‌ ఇవ్వడంలేదనే అన్పిస్తోంది. తెలుగులో మాట్లాడటం దగ్గర్నుంచి, టాస్క్‌లు పూర్తి చేయడం వరకు.. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రతివారం హోస్ట్‌ నానిది ఒకటే అప్పీల్‌. కానీ, ఆ అప్పీల్‌ని హౌస్‌ మేట్స్‌ ఎవరూ గౌరవించడంలేదు. చెప్పీ చెప్పీ నానికి కూడా బోర్‌ కొట్టేస్తోంది. ఆ విషయమే నిన్న కూడా నాని చెబుతూ, 'వాపోయాడు'. బిగ్‌బాస్‌ మాటకి వాల్యూ లేదు.. నాని హెచ్చరికలకూ లెక్క లేదు. 

Image result for nani bigg boss

ఇక, కంటెస్టెంట్స్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా అంచనాలకు అందడంలేదన్న విమర్శ మొదటి నుంచీ విన్పిస్తూ వచ్చింది. అదే కొనసాగుతోంది కూడా. శ్యామల ఎందుకు ఎలిమినేట్‌ అయ్యింది.? ఎందుకు తిరిగొచ్చిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. నూతన్‌ నాయుడు విషయంలోనూ సేమ్‌ టు సేమ్‌ అదే జరుగుతోంది. మరోపక్క, సోషల్‌ మీడియాలో కంటెస్టెంట్స్‌ తరఫున వారి మద్దతుదారుల బూతుల ప్రవాహం రోజురోజుకీ హద్దులు దాటేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: