ఈ మధ్య సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ లీకుల గోల ఎక్కువై పోయింది. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా స్టిల్స్ రెండు సార్లు లీక్ అయ్యాయి. దానితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ సైరా కూడా లీకుల భారిన పడింది. అయితే ఎన్టీఆర్ యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. మరీ చిరు ఎందుకు తీసుకోవడం లేదని మాటలు వినిపిస్తున్నాయి.  సైరా సినిమాకు సంబంధించి గతంలో కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి.

Image result for sairaa

ఆ వెంటనే యూనిట్ అప్రమత్తమైందంటూ వార్తలొచ్చాయి. ఇక సైరా నుంచి ఎలాంటి లీకులు ఉండవని భావించారు. కానీ తాజాగా మరో 3 స్టిల్స్ బయటకొచ్చాయి. అవి కూడా సినిమాలో అత్యంత కీలకమైన ఘట్టానికి సంబంధించిన ఫొటోలు. కోట ప్రహరీకి సంబంధించిన భారీ సెట్ నిర్మాణం. ఆ నిర్మాణం లోపల బ్రిటిష్ సైనికులు, బయట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైనికులు. పైనుంచి సైనికుల కాల్పులు. కింద నుంచి నరసింహారెడ్డి సేనల ఎదురుదాడి.

Image result for sairaa

ఇలాంటి కీలకమైన ఘట్టానికి సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. దీంతో యూనిట్ ఒక్కసారిగా అవాక్కయింది. సాధారణంగా ఇలాంటి లీకేజ్ స్టిల్స్ సినిమాపై హైప్ తీసుకొస్తుంటాయి. కానీ కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు లీక్ అయితే మాత్రం సినిమాపై ఉత్సుకత తగ్గిపోతుంది. అదే ఇప్పుడు సైరా యూనిట్ భయం. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: