చిరంజీవి కాంగ్రెస్ తరుపున పోటీ చేయనున్నట్లు స్వయంగా కాంగ్రెస్ నాయకుడు రఘువీరా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్  కు ప్రత్యర్థి గా ఉన్నాడు. అయితే ఇప్పడూ చిరంజీవి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేనను విమర్శించాల్సి వస్తుంది. అస్సలు రఘువీరా రెడ్డి ఏమన్నాడంటే... చిరంజీవి నాతో, రాహుల్‌తోనూ మాట్లాడారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి కాంగ్రెసు తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. నెల క్రితం కూడా ఇదే విషయం చెప్పారు' అన్నారు.

Image result for pavan kalyan janasena

కాంగ్రెసు తరపున ప్రచారం చేస్తానని రెండుసార్లు స్పష్టంగా చెప్పాడంటే అందుకు కమిటైనట్లే కదా. రఘువీరా రెడ్డి చెప్పిందాన్నిబట్టి మెగాస్టార్‌ కాంగ్రెసుతో బంధం తెంపుకోదల్చుకోలేదని అర్థమవుతోంది. కాకపోతే  పార్టీలో మాత్రం యాక్టివ్‌గా పనిచేయడంలేదు. రెండు నెలలు ప్రచారం చేసి వెళ్లిపోతాడన్నమాట. ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్న వెంట ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని అందుకోవడానికి తాపత్రయపడుతున్నాడు.

Image result for chiranjivi

ఈమధ్య చిరంజీవి అభిమానులు భారీఎత్తున జనసేనలో చేరారు. ఆ సందర్భంగా అన్నయ్యపై తనకు ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేశాడు పవన్‌. తనకు అన్నయ్యే స్ఫూర్తి అని చెప్పాడు. అలాంటి అన్నయ్య తమ్ముడికి వ్యతిరేకంగా పనిచేస్తాడా? కాంగ్రెసుకు జనసేన కూడా ప్రత్యర్థే కాబట్టి దానిపై కూడా విమర్శలు చేయాల్సిందే కదా. చిరంజీవి తాను జనసేనను, పవన్‌ను విమర్శించనని, టీడీపీ, బీజేపీ, వైకాపాను చీల్చిచెండాడతానని అంటాడా? అలాంటి కండిషన్‌ సాధ్యం కాదు కదా. మరి ఈ విషయం తెలిసి కూడా చిరంజీవి ప్రచారానికి ఒప్పుకున్నాడంటే తమ్ముడిపై ప్రచారం చేయడానికే సిద్ధమయ్యాడని అనుకోవాలి. పార్టీ పట్ల కమిట్‌మెంట్‌ ఉంటే ఈ పనిచేయక తప్పదు. అలాంటప్పుడు విమర్శల డోసు తగ్గించవచ్చు లేదా పవన్‌పై నేరుగా విమర్శలు చేయకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: