ఏ పార్టీలో అయినా అధినేత‌కే అగ్ర‌తాంబూలం. పార్టీని న‌డిపించేంది, క‌ష్టాల‌లో పార్టీని కాపాడేది, నేత‌ల‌కు అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించేది అధినేతే కాబ‌ట్టి.. ఆయ‌న‌కు అంద‌రూ అణిగిమ‌ణిగి ఉండ‌డంలో త‌ప్పులేదు. కానీ, ఏపీ అధికార పార్టీ టీడీపీలో మాత్రం ప‌రిస్థితి రివ‌ర్స్ లో ఉంది. ముందొచ్చిన చెవుల క‌న్నా.. వెన‌కొచ్చిన కొమ్ములు వాడి! అన్న‌ట్టుగా టీడీపీ లో ప‌రిస్థితి త‌యారైంది. పార్టీలో ఎంద‌రో సీనియ‌ర్లు ఉన్నారు. ఆ లెక్క‌కొస్తే.. చంద్ర‌బాబుతో చేయి చేయి క‌లుపుకొని రాజ‌కీయాల్లో తిరిగిన కేఈ కృష్ణ‌మూర్తి, క‌ర‌ణం బ‌ల‌రాం, కోడెల‌శివ‌ప్ర‌సాద్ వంటి అగ్ర‌నాయ‌కులు ఉన్నారు. 

Image result for కేఈ కృష్ణ‌మూర్తి

అయితే, ఇలాంటి వారంతా.. చంద్ర‌బాబు ను బాస్ అనేందుకు ఎలంటి సంకోచ‌మూ చెంద‌డ‌డం లేదు. కానీ, మ‌రో నేత బాస్ ను మించిన బాస్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో సీనియ‌ర్లు మీడియావ‌ర్గాల వ‌ద్ద క‌న్నీళ్లు ఒత్తుకుంటున్నారు. ``మేం నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్నాం. మేమే పెద్ద బాసులం. మాకీ య‌న బాసా?! బెల్ కొట్ట‌గానే లైన్‌లో నుంచోవాల‌ట‌., ఆయ‌న ముందు చేతులు క‌ట్టుకుని లెక్క‌లు చెప్పాలంట‌!! మా ఖ‌ర్మ కాక‌పోతే..!`` ఇదీ రాయ‌ల‌సీమ కు చెందిన ఈ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు ఇటీవ‌ల ఆఫ్‌ది రికార్డుగా ఓ మీడియా ప్ర‌తినిధి ముందు వెళ్ల‌బోసుకున్న గోడు. ఈయ‌నొక్క‌డే కాదు.. ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే, కొంద‌రు బ‌య‌ట‌ప‌డుతున్నారు. 

Image result for క‌ర‌ణం బ‌ల‌రాం

మ‌రికొంద‌రు మౌనంగా భ‌రిస్తున్నారు. స‌రే! ఇంత‌కీ ఆ బాస్‌ను మించిన బాస్ ఎవ‌రో ఇప్ప‌టికే అర్ధ‌మై ఉంటుంది. ఆయ‌నే సీఎం త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ బాబు! ఆయ‌న బాబును మించిన బాస్‌గా మారిపోయార‌ని, త‌మ‌పై దండ‌యాత్ర చేస్తున్నార‌ని సీనియ‌ర్లు వాపోతున్నారు.  ప్రతి విషయానికి లోకేష్‌ వద్దకు వ‌చ్చి చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డాలంటే.. మాకూ ఓ స్టేట‌స్ ఉంద‌ని గుర్తించాలి క‌దా? అంటున్నారు సీనియ‌ర్లు.  తమ కళ్ల ముందు పుట్టి పెరిగిన లోకేష్‌ వద్దకు వెళ్లి నిలబడడానికి, ఏమైనా అడగడానికి వారు ఇబ్బం దిగా, అసౌకర్యంగా ఉంటోందనేది పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారం. 

Image result for kodela siva prasad

పాత తరానికి చెందని ఈ నాయకులు... పార్టీలో నెంబర్‌టూగా ఉన్న లోకేష్‌తో వ్యవహరిం చడం..కష్టంగా మార‌డం, అది కూడా ఎన్నిక‌ల ముందు ప‌రిస్థితిని తీవ్రం చేస్తోంది.  దీంతో..లోకేష్‌కు వారికి మధ్య.. విభేదాలు, అపార్ధాలు వస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బాధితుల‌లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులతో పాటు..ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరిన నాయకులు కూడా ఉన్నారట. ముగ్గురు సీనియర్‌ మంత్రులు ఈ విషయంలో మ‌రింత‌గా ఆవేద‌న చెందుతున్నార‌ని, ఈ విష‌యాన్ని చంద్ర‌బాబుకే నివేదించాల‌ని చూస్తున్నార‌ట మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: