రాబోయే ఎన్నికలను లక్ష్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మలచడానికి తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాడు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014 ఎన్నికలలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అది కొద్ది సమయంలోనే రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనడం జరిగింది.

Image result for pardha saradhi

ఇదే విషయాన్ని వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్థసారధి ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ...చంద్ర‌బాబు నాయుడు మాయ‌మాటలు, ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ సోష‌ల్ మీడియాలో ట్వీట్లు, మ‌రో టీడీపీ మంత్రి య‌న‌మ‌ల‌ ప్రెస్ మీట్ల‌తో ప్ర‌జ‌ల్లో అసోహ రాజకీయాల‌ను చేస్తూ చాపకింద నీరులా దుర్మార్గ‌మైన చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Image result for chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఉంటూ రాజ్యాంగం ప్రకారం లేకుండా ఇష్టమొచ్చిన రీతిలో రైతుల దగ్గర భూములను లాక్ కొంటున్నారని మండిపడ్డారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల పొట్ట‌కొట్టే విధంగా కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకువ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. అయితే ఆ చ‌ట్టాన్ని వ్య‌తిరేకంగా రైతులే కాకుండా రాష్ట్ర ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ దుర్మార్గ‌పు దోపిడీ చ‌ట్టాన్ని అడ్డుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Related image

దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఇంత దుర్మార్గ‌పు చ‌ట్టాన్ని తీసుకురావ‌టానికి కృషి చేయ‌లేద‌ని కానీ మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. గత ఎన్నికలలో రైతు రుణమాఫీ అనే ఆచరణ కానీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతు పొట్ట కొట్టడానికి చంద్రబాబు సిద్ధపడటం నీచాతి నీచమైన రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: