వైసీపీ అధినేత జగన్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే నిజంగా జగన్ రాజకీయాలలో పరిణితి చెందాడని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిక్కు లేని పరిస్థితిలో దారుణమైన స్థితిలో ఉన్న సమయంలో పాదయాత్ర అంటూ మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి కేంద్రంలో రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి. అయితే అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ చనిపోవడంతో కేంద్రంలో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన ఆంధ్రరాష్ట్రాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం నానా ఇబ్బందులు పెట్టాయి. ఈ క్రమంలో తండ్రి మరణించటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉన్న జగన్ రాష్ట్రంలో తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర కి శ్రీకారం చుట్టారు.

Image result for jagan

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జగన్ మీద కక్షకట్టి పార్టీలోని తీవ్ర ఇబ్బందులు పాలు చేసింది. దీంతో జగన్ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తనను తన కుటుంబాన్ని ప్రేమిస్తున్న ప్రజలకోసం వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కొత్త పార్టీ తన తండ్రి పేరిట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించారు. అపర ఇక్కడినుంచి జగన్ రాజకీయ జీవితాన్ని గమనిస్తే రాజకీయ విశ్లేషకులు అలాగే తల పండిపోయిన రాజకీయ నేతలకు కూడా మతి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ జగన్ ని మరింత ఇబ్బందులు పాలు చేయాలని లేనిపోని అవినీతి కేసులలో ఇరికించి 16 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. ఈ క్రమంలో జగన్ ఎక్కడ కూడా బెదరకుండా ప్రజల కోసం తానిచ్చిన మాట కోసం నిలబడి..తన తల్లి చెల్లి చేత ప్రజలను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు...ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో జగన్ తల్లి చెల్లి విజయమ్మ షర్మిల కలిసి ప్రత్యర్థులతో పోరాడి... 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించే టట్లు చేసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి...కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. అయితే ఆ సమయంలో వైయస్ జగన్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో..కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది.

Image result for jagan jail

ఈ క్రమంలో వైఎస్ జగన్ వైసిపి పార్టీని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఉండేటట్లు బాధ్యతలు స్వీకరించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ప్రతిపక్షానికి పరిమితం అయింది. అయితే ఆ సమయంలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి చంద్రబాబు రావడానికి గల బలమైన కారణం అబద్ధాలు మోసాలు అమలు చేయలేని హామీలు ప్రకటించటం అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్కళ్యాణ్ కలసి పోటీ చేసిన నేపథ్యంలో...ఇటువైపు సింగిల్ గా ఉన్న జగన్ కి కేవలం కొద్దిపాటి ఓట్ల తేడాతో మాత్రమే అధికారం కోల్పోవడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పం పాదయాత్ర పేరిట రాష్ట్రం మొత్తం పాదయాత్రకి జగన్ శ్రీకారం చుట్టిన విషయం మనకందరికీ తెలిసినదే.

Related image

ఈ పాదయాత్రతో  జగన్ ఆంధ్రరాష్ట్రంలో కలసికట్టుగా ఉన్న టిడిపి బిజెపి జనసేన పార్టీలను తన ఒక ఒక్క అడుగుతో చీల్చుకుంటూ వెళ్లిన సంగతి మనకందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అది రాష్ట్ర హక్కని జగన్ బలంగా నమ్మి ...ప్రత్యేకహోదా హక్కును నిర్వీర్యం చేయాలనుకున్న చంద్రబాబుకి ముచ్చమటలు పట్టించి..ఆఖరికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు చెప్పేలా చేశారు జగన్. అయితే మరోపక్క కాపులను బీసీల్లో చేరుస్తామని 2014 ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు. అయితే తాజాగా ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ కాపుల నుద్దేశించి చేసిన ప్రసంగం ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రాలలో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ అమలు కాకూడదని తీర్పు ఉన్న నేపథ్యంలో….ఆంధ్రరాష్ట్రంలో కాపులను బీసీ లో చేర్చడం అసాధ్యమని జగన్ నిర్మొహమాటంగా ప్రజలకు తెలియజేశారు.

Related image

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావటానికి టీడీపీ జనసేన బిజెపి పార్టీలు ఇష్టమొచ్చిన రీతిలో గత ఎన్నికల లాగా ఆచరణ కానీ హామీలు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ నేను మాట మీద నిలబడతా. చేయగలిగింది మాత్రమే చెబుతా. చేయలేనిది చేస్తానని చెప్పే అలవాటు నాకు లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో అబద్దాలు చెప్పే నాయకుడు నీకు కావాలా…?మోసం చేసే నాయకుడు మీకు కావాలా ..? అంటూ ప్రజలకు ప్రశ్న వేసి. వచ్చేఎన్నికలలో మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి అంటూ తాను పాదయాత్ర చేపడుతున్న ప్రతి చోటా చెప్పుకుంటూ స్వచ్చమైన రాజకీయాలకు నాంది పలుకుతూ ముందుకు సాగుతున్నారు జగన్.

Image result for jagan padayatra

అయితే ఇదంతా గమనిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు...విశ్లేషకులు..జగన్ సంచలనం అని...చరిత్రలో తన తండ్రి వైయస్సార్ ఎలా నిలిచిపోయాడో...ప్రజల హృదయాలలో….ఆయన కంటే మెరుగుగా నే అద్భుతమైన పాలన అందించి కొత్త చరిత్ర సృష్టిస్తారు అని అంటున్నారు. మరోపక్క ఎన్నికల ముందు అవినీతి కార్యక్రమాలు పక్కనపెట్టి ప్రజల మధ్యకు వచ్చిన చంద్రబాబుని...అలాగే సినిమాలు పక్కనపెట్టి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీ... వారు చేస్తున్న రాజకీయాలను చూసి ఆంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. ఈసారి కచ్చితంగా జగన్ను ముఖ్యమంత్రి చేసుకుంటామని బలంగా చెబుతున్నారు. మరో పక్క రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్ని సర్వేలలో కూడా జగన్ కి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే భవిష్యత్తు మొత్తం జగన్ వైపే ఉన్నట్టు రాజకీయ నాయకులలో టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి: